Others

తాప్సీ టైం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కహానీ’ చెప్పి విద్యాబాలన్ ఎక్కడికో వెళ్లిపోయింది. ‘క్వీన్’ టాలెంట్ చూపించి కంగనా రనౌత్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆ చాన్స్ సొట్టబుగ్గల సుందరి తాప్సీకి రావొచ్చన్నది బాలీవుడ్ మాట. తెలుగువాళ్లేమో తప్పించుకుని తిరిగి, అరవం వాళ్లేమో అస్సలు ఆదరించక పోవడంతో -‘ఐరన్ లెగ్’ మోయలేక తాప్సీ తెగ ఇబ్బందులే పడింది. కాలం ఎప్పుడూ ఓ తీరుగా ఉండదుగా. ఏ దిక్కూ లేనోళ్లకు బాలీవుడ్డే దిక్కన్నట్టు అక్కడ అడుగుపెట్టిన ఢిల్లీ అందగత్తెకు -ఒకట్రెండ్ సినిమాలు బాగానే పడ్డాయి. ఈమధ్యే బాలీవుడ్‌లో చేసిన ‘పింక్’ గొప్ప పేరు తేవడంతో -తాప్సీ టర్న్ స్టార్టయ్యిందని అంటున్నారు బాలీవుడ్ జనాలు. కాడమల్లిపూవు క్వాలిటీగా నవ్వినట్టుండే బ్యూటీ -ఒక్కసారిగా డీగ్లామరైజ్డ్ పాత్ర చేస్తూ అప్పుడే అంచనాలు పెంచేస్తోంది. ‘బేబీ’కి ఫ్రీక్వెల్‌గా వస్తున్న ‘నామ్ శభానా’లో డీగ్లామర్డ్ ముస్లిం యువతి పాత్రలో ఆమె అభినయం చూస్తుంటే -హైట్స్‌కు వెళ్లిపోవడం ఖాయం అంటున్నారు జనాలు. తన టాలెంట్‌ను దక్షిణాది దర్శకులు వాడుకోలేకపోయారని బహిరంగంగానే చెబుతున్న బ్యూటీ -బాలీవుడ్‌లో ‘నామ్ శభానా’ వర్కవుటైతే.. తరువాత హాలీవుడ్‌పైనా కనే్నస్తానని నమ్మకంగా చెబుతోంది. దటీజ్ -తాప్సీ.