Others

భానుమతి తొలి విజయం.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరి జీవితాల్లో వారి వారి ప్రయత్నాలకు అనుగుణంగా శ్రమనుబట్టి విజయం సాధించిన సందర్భాలున్నాయి. మహానటి భానుమతి విషయం తీసుకొంటే ఆమె అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించగలిగింది. అందుకే నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా.. మరెన్నో రంగాల్లోనూ విజయం సాధించిన మహిళగా కీర్తిని ఆర్జించింది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లి.. భానుమతి తొలి విజయం వివరాలను చూద్దాం. స్టార్ కంబైన్స్ కృష్ణ ప్రేమ (1947) నిర్మాణపు రోజులవి. పాలువాయి రామక్రిష్ణ ఆ చిత్రానికి సహాయ దర్శకుడు. రాముడు మంచి బాలుడు అన్న రీతిలో తన పనేదో తాను చేసుకుంటూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా యూనిట్‌లో అందరితో మంచివాడు అనిపించుకున్నాడు. అందరి మాట ఎలావున్నా, భానుమతిని మాత్రం అమితంగా ఆకర్షించాడు రామక్రిష్ణ. వీరిద్దరి మూగప్రేమను యూనిట్ సభ్యులూ గమనిస్తూనే ఉన్నారు. చిత్రం పేరు కృష్ణప్రేమ. అయినా భానుమతి విషయంలో అది ‘రామ’క్రిష్ణ ప్రేమగా మారింది. ఈ విషయం భానుమతి తండ్రి వెంకట సుబ్బయ్య వరకూ వెళ్ళింది. రామక్రిష్ణ పెద్దలతో సంప్రదింపులు, మిగతా వ్యవహారాల్లో నిమగ్నమయ్యారు వెంకట సుబ్బయ్య. ఈలోపున స్టార్ కంబైన్స్ అధినేత రామయ్య ఆయన భార్య కణ్ణామణి చొరవ తీసుకొన్నారు. ఒకరోజు ఉదయం భానుమతీ రామకృష్ణలను రమ్మనమని పిలుపువచ్చింది. రామయ్యతో వచ్చిన మిత్ర బృందం వీరిద్దరి చుట్టూచేరి మీకిప్పుడు పెళ్ళి అని తేల్చేశారు. అంతేకాదు మద్రాసు జార్జిటౌన్‌లోని శివాలయానికి తీసుకెళ్లారు. ఇంత హఠాత్తుగా పెళ్ళంటే ఎలా? పెద్దవాళ్ళకు చెప్పొద్దా? అని సంశయించారు భానుమతి, రామక్రిష్ణలు. ఇద్దరి తల్లిదండ్రులు లేకుండానే వివాహ కార్యక్రమం ముగిసింది. వధూవరులిద్దరూ మధుపర్కాలతో వెంకట సుబ్బయ కాళ్ళమీద పడి మమ్మల్ని దీవించండి అన్నారు. సినిమా కథ సుఖాంతం అయినట్టుగా నీకింత పట్టుదల అయితే నేను కాదనేవాడినా. అయిందేదో అయింది. కులాంతరం కాలేదు, సంతోషం.. అంటూ నాకు వివాహం జరిపించే యోగ్యం కలిగించలేకపోయావు అన్నారు. ‘నీ పట్టుదలే నాకు వచ్చింది, దీవించు నాన్నా’ అన్న భానుమతిని మనసారా దీవించారు తండ్రి వెంకట సుబ్బయ్య. మాంబళం ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు పదిహేను రూపాయలకు కిరాయికి తీసుకొని కాపురం ప్రారంభించారు భానుమతి, రామక్రిష్ణ. నిజానికి ఇదే భానుమతి సాధించిన అతి పెద్ద తొలి విజయం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717