Others

రె.. రె.. రెజీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడెలా కెరీర్ కొనసాగించాలో బాగా తెలిసిన రెజీనా -రూటు మార్చింది. తెలుగులో గ్లామర్ డోస్ పెంచి -సెపరేట్ ట్రాక్ వేసుకున్న రెజీనా, తమిళంలో మాత్రం క్లాసిక్ టచ్ పాత్రలే చేస్తోందట. నిజానికి ‘ఆర్’త్రయం -రకుల్, రాశి, రెజీనా.. ఇంచుమించు ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చినా ‘స్టార్‌వార్’లో రెజీనా నెగ్గుకు రాలేకపోయింది. తనకూ టైం రాకపోతుందా? అన్న ఆశతో టాలీవుడ్‌లో అతికష్టంగా చాన్స్‌లు అందుకుంటూ వచ్చింది. ఇప్పుడు రెజీనాకు టైం వచ్చింది -కాకపోతే తమిళంలో. నెంజం మరప్పదిల్లె, జెమిని గణేశునుం సురులి రాజనుం, శరవణన్ ఇరుక్క భయమేన్, రాజతందిరం-2, వౌనగరం లాంటి ప్రాజెక్టులతో ఒక్కసారిగా బిజీ అయిపోయింది. షిఫ్టులవారీ టైమింగ్స్ అడ్జెస్ట్ చేస్తూ -ఎవరికీ ఇబ్బందిలేకుండా షూటింగుల్లో పాల్గొంటోందట. రెజీనా కమిట్‌మెంట్ చూసి నిర్మాతలు, దర్శకులే ఆశ్చర్యపోతున్నారు. అవునుమరి -ఎక్కడెలా కెరీర్ సాగించాలో రెజీనాకు బాగా తెలుసుమరి. అందుకే పాత్ర పడినపుడే తెరను చక్కబెట్టాలన్న థియరీతో ముందుకుపోతోంది.