Others

ఆరోగ్య‘్ఫలమస్తు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం, మనసు ఆహ్లాదంగా ఉండాలంటే సంపూర్ణ ఆరోగ్యం అవసరం. అది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి వుంటుంది. ఇదే విషయాన్ని వైద్యులు సైతం చెప్పక తప్పదు. ఫలాలు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యఫలం సిద్ధిస్తుందని, ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధులు చాలా తక్కువగా వచ్చే అవకాశం వుంటుంది. వీటిల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. డ్రైఫ్రూట్స్ తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి చాలావరకూ మేలు చేకూరుతుంది. ఇవి తింటే ఎన్నో రోగాలు నయం అవుతాయి. నిద్రలేమి, ఊబకాయం, కంటివ్యాధులు, రక్తహీనత, కీళ్లనొప్పులతో సతమతమయ్యేవారు క్రమపద్ధతిలో వీటిని తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.
ఖర్జూరం: ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు దోహదపడుతుంది. రక్తం శుద్ధిచేసేందుకు ఖర్జూరం ఉపయోగపడుతుంది. పీచుతో కూడిన పండు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
జీడిపప్పు: దీనిలో కాల్షియం పోషక పదార్థాల శాతం ఎక్కువ. దీనిని సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. అతిగా తింటే అనారోగ్యానికి దారితీస్తుంది.
బాదం: కాల్షియం, ఐరన్ ఉంటాయి. చిన్న పిల్లలకు తగిన మోతాదులో తినిపిస్తే మంచిది. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
పిస్తా: పీచుపాళ్ళు ఎక్కువ. పోషక పదార్థాలు కూడా అధికంగానే వుంటాయి. రక్తనాళాలను శుద్ధి చేస్తుంది.
ఎండుద్రాక్ష: దీనిలో ఐరన్ శాతం ఎక్కువ. రక్తహీనతను అరికడుతుంది. మహిళలు ఆరోగ్యవంతంగా వుండేందుకు ఇది దోహదపడుతుంది.
వాల్‌నట్‌లు: శరీరానికి వేగంగా శక్తినిచ్చేందుకు వాల్‌నట్‌లు ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. గుండె పనితీరును క్రమబద్ధీకరించేందుకు, అధిక బరువును తగ్గించేందుకు తోడ్పడతాయి.
అంజురా: చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ల శాతం ఎక్కువ. ఇది శక్తిని సమకూర్చేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి వీటిని ఇవ్వడం చాలా మంచిది.

- నీలిమ సబ్బిశెట్టి