రుచి

ఆకుకూరలతో ఆరోగ్యంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అతి చౌకగా లభించే ఆకు కూరలు తినటమే మేలు. కాని పచ్చటి ఈ ఆకుకూరలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే అధిక బరువు పెర గకుండా శరీరాకృతి నాజుకుగా కూడా ఉంటుంది. సాత్వికాహారమైన ఆకు కూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి. వండటానికి ముందు ఆకులపైన జల్లిన మందు వాసన పోయేలా శుభ్రంగా కడగాలి.
ఆకులను పెద్ద పెద్ద ముక్కలుగా తరిగిగానీ అసలు తరగకుండా గానీ వండుకోవడం మంచిది. ఎప్పుడూ తాజాగా వుండే ఆకుకూరలనే వండుకోవాలి. నిలువ వుంచిన కొద్దీ వాటిల్లో పోషక పదార్థాలన్నీ తగ్గుతాయి. ఆకుకూరలు వేయించి తినకూడదు. ఖనిజాలు, విటమిన్‌లు పోయి పిప్పి మిగులుతుంది. క్యారెట్, ముల్లంగి లాంటి దుంప కూరలతోబాటు వాటికుండే ఆకులను కూడా వండుకొని తింటే మరికొన్ని పోషకాలు దక్కుతాయి.
తోటకూరలో 50వేల కేలరీల శక్తి లభిస్తుంది. బి1, బి2 విటమిన్లు కూడా ఎక్కువగా ఉండటమే కాకుండా కంటిచూపుకు ఉపయోగపటడుతుంది.
బచ్చలికూరలో 66 శాతం ఇనుము వుంటుంది. శరీరానికి ఇది చలువను, శక్తిని అందిస్తుంది. మొలలు వంటి వ్యాధులను అరికడుతుంది. కొత్తిమీర రక్తవృద్ధిని, జీర్ణవృద్ధిని, ఆకలిని పెంచుతుంది.
కరివేపాకు కేన్సర్‌ని నివారిస్తుంది. గోంగూర దగ్గు, ఆయాసం, తుమ్ములు, జలుబుకు మంచి మందులా పనిచేస్తుంది. కాల్షియం లభ్యమై రక్తహీనతను పోగొడుతుంది.
అవిశె కూరలోని ఐరన్ గర్భిణీ స్ర్తిలకు ఎంతో మేలు చేస్తుంది. మూత్రాశయాల్లోని రాళ్ళు కరిగించే శక్తి ఈ ఆకుకూరకు వుంది.
పుదీనాకు నోటి దుర్వాసనను, నోటిలోని పుండ్లను నివారిస్తుంది. దీని వాసనకు క్రిములు దూరవౌతాయి.