Others

నగదు ర‘హితమే’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నగదు రహిత లావాదేవీలతో లాభమేమి? వివరింపుము.

జవాబు:
చిల్లర లేదంటూ బల్లను గుద్ది..
పిల్లికి బిచ్చం వెయ్యనక్కర్లేదు
పెళ్లికి చదివింపులు చెయ్యనక్కర్లేదు
పరామర్శకి పళ్లు, రొట్టె మోయనక్కర్లేదు
పెళ్లానికి మల్లెలు తేనక్కర్లేదు
పిల్లాడికి పుల్లయిసులు కొనక్కర్లేదు
ఫ్రెండ్స్‌కి పార్టీ ఇయ్యక్కర్లేదు
పేరంటానికి బొట్టూ గాజులు పెట్టక్కర్లేదు
పక్కింటోళ్లకి అప్పులూ చేబదుళ్లు అసలివ్వక్కర్లేదు
సర్వర్లకి టిప్పులు దులపక్కర్లేదు
గొప్పలకు డప్పులు కొట్టక్కర్లేదు..

సరే.. సరే.. మరి నష్టాలో..?
ఒకటే నష్టం.. ఒకటే కష్టం
ప్లాస్టిక్ కార్డులో కాసులు నింపి
కాళ్లు బార్లాచాపక్కర్లేదు
ఎందుకంటే-
ఇకనుంచి
దొంగలు కష్టపడనక్కర్లేదు
నిద్రాహారాలు మానక్కర్లేదు
రాత్రీపగలూ కాపుకాయక్కర్లేదు
సందు చూడక్కర్లేదు.. మాటు వేయక్కర్లేదు
కన్నం, సొరంగం తవ్వక్కర్లేదు
జస్ట్..
ఒక్క క్లిక్ నేరిస్తే చాలు..
పాస్‌వర్డ్ లాగేస్తే చాలు..
ఇంట్లో కూర్చొని దోచేయుచ్చు
ఇంటర్నెట్‌లో దాచేయొచ్చు
చికాగోలో ఉంటూ
శ్రీకాకుళాన్ని గుండు గీసెయొచ్చు
ఒట్టు.. పక్కనున్నవాడికి తెలిస్తే ఒట్టు
ఒక్కదెబ్బతో నీ కష్టార్జితమంతా ఫట్టు..!
(ముందుగా నగదు రహిత లావాదేవీలను పకడ్బందీగా తయారుచేసి,
జనంలో అవగాహన పెరిగాక ఆ దిశగా అడుగులేస్తే మంచిది.)

- డా. జివిజి శంకరరావు, పార్వతీపురం