Others
గవాస్కర్ ‘టచ్‘: సెంచరీ గ్యారంటీ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అలనాటి లిటిల్ మాస్టర్ సునీల్ మనోహర్ గవాస్కర్‌కి సంబంధించి చాలా తమాషా తమాషా కథలున్నాయ్. ఇటీవల ఒక ఇంటర్‌వ్యూలో- వెస్టిండీజ్ లెజెండ్ సోబర్స్ ఒక చిత్రమయిన సంగతి చెప్పాడు.
గ్యారీ సోబర్స్‌ని గవాస్కర్ ఒకసారి ‘్థంక్స్’ చెప్పి మరీ మెచ్చుకున్నాడు. గ్యారీ, సునీల్ చాచికొట్టి బంతిని గాలిలోంచి రాగా పట్టుకోలేక చేజార్చాడు. ఆ డ్రాప్‌తో పుంజుకుని గావస్కర్ సెంచురీ చేసి కాని పెవిలియన్‌కి తిరిగి రాలేదు. దానిమీద జోకులర్‌గా- ‘‘గ్యారీ! నువ్వు బ్యాటింగ్‌కి వెళ్ళేటప్పుడు నన్ను ‘తాకి’ వెళ్లు. అదే నీకు గుడ్‌లక్ అవుతుందని వరమిస్తున్నాను’’ అంటూ, నవ్వుతూ చెప్పాడు సునీల్.
అయితే, గ్యారీ సోబర్స్ రుూ మాటలను సీరియస్‌గా తీసుకుని క్రీజ్‌లోకి వెళ్ళే ముందు గావస్కర్‌ని ‘టచ్’ చేసి మరీ వెళ్ళేవాడు. అలాగ ఇండియామీద గ్యారీ మూడు సెంచురీలు బాదేశాడు. అప్పుడు, క్యాప్టెన్ అజిత్‌వాడేకర్‌కి యిది చిర్రెత్తించింది. ‘‘ఇకమీద సోబర్స్ వచ్చి, నిన్ను ముట్టుకుంటానంటే- ఒప్పుకోకు. పారిపో. నీ టచ్ అతనికి ‘లక్’, కాని- నాకు (టీముకి) లాస్’’ అంటూ ఆదేశించాడట. సోబర్స్ వయసు యిప్పుడు 80 సంవత్సరాల 197 రోజులు. అతని ఖాతాలో 26 సెంచురీలున్నాయి. గ్రేట్ ఆల్‌రౌండర్!