Others

చెట్లకీ ఆధార్ కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆధార్ కార్డు అన్నిటికీ ఆధారంగా చేసుకోండి’ అన్న ఉద్యమం ఒకటి ఇండియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. కానీ, చైనా దేశం ఎప్పుడూ మనకన్నా రెండు మెట్లు అడ్వాన్స్‌గా వుంటున్నానంటుంది. చైనాలో వున్న పర్వత ప్రాంతం ‘తాయి’లో అతి ప్రాచీనమయిన చెట్లు చాలా వున్నాయి. వీటిని సర్వే చేసి, ఎన్నో వివరాలు పొందుపరిచి ఒక్కో చెట్టుకి ఒక్కో గుర్తింపు డిజిటల్ కార్డు యిప్పించింది- అదే ‘ఆధార్’ అన్నమాట.
చైనా ప్రభుత్వం ఆ విధంగా ఇరవై వేల చెట్లకి డిజిటల్ ఆధార్ కార్డు డేటా బేస్ తయారుచేశారు. దీనితో, రుూ చెట్ల ఎదుగుదల తీరుతెన్నులు, పర్యావరణ ప్రభావం వగైరాలను పరిశోధించడం తేలిక అవుతుందిట. కానీ ఇండియాలో ఆధార్ కార్డుని అన్ని రకాల సదుపాయాలకీ వాడమంటున్న గవర్నమెంటు చెట్ల వూసు ఎత్తడంలేదింకా-
చెట్లకీ, మనుషులకీ వున్న తేడా ఏమిటీ అంటే మనుషులు ఇల్లు మారుతారు- వూరు మారుతారు. గానీ వారి చిరునామా, వయస్సూ ఆధార్ కార్డులలో మారడం వుండదు. అదంతా ఓ గొడవ. నిత్య జీవితంలో సతమతం అయ్యే జనం- ఆధార్ కార్డులో రాసిన చోటే వుండాలంటే సాధ్యం కాదు. చెట్లు- అనగా ‘నగములు’- అలాగే కొండలు కూడా నగములే- నడిచి పోవు ఎక్కడికీ. అదీ తేడా!

-వీరాజీ