Others

ముంగిట ముగ్గు.. లక్ష్మీకి కొలువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇంటి ముందు ముగ్గు ఇల్లాలి సృజనకు వెలుగు’’ అని అంటా రు. ఇంటి ముందు వేసిన ముగ్గును బట్టి ఆ ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చెప్పవచ్చు. పూజకైనా, పేరంటానికైనా ముగ్గు వేస్తాం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా ముగ్గువేసి దానిపైనే నైవేద్యం పళ్లెం పెడతాం. ముగ్గుల్లో సైన్సు దాగివుంది. ఎందుకంటే సూక్ష్మక్రిములు రాకుండా పేడతో కళ్లాపి జల్లి సున్నంతో ముగ్గుపెడతారు. బియ్యం పిండి ముగ్గు సూక్ష్మ జీవులు తినడానికి ఉపకరిస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ఈ రంగవల్లులను సుద్దపొడి లేక శంఖాల పొడితోగాని, పిండితోగానీ అందంగా తీర్చిదిద్దుతారు. మనకున్న అరవైనాలుగు కళల్లో చిత్రలిపి కూడా ఒకటి. చిత్రాలను స్ర్తి,పురుషులిద్దరూ గీస్తారు. కాని ముగ్గులు స్ర్తిలకు మాత్రమే సొంతం. ఇది కళాతృష్ణ. ప్రకృతి ఆరాధనకు తార్కాణాలు. గతంలో సంక్రాంతి ముగ్గులు పరిశీలిస్తే దేవుళ్లు, దేవతలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు చోటుచేసుకునేవారు. కాని ఆధునిక ముగ్గుల్లో జోకర్లు, జంతువుల బొమ్మలు, మిక్కివౌస్ వంటివి కనిపిస్తున్నాయి. ముగ్గులతో తెలుగు భాషను పిల్లలకు సైతం నేర్పటం ఆధునిక కళలో వచ్చిన మంచి పరిణామమని చెప్పవచ్చు. అందుకే ముగ్గుల్లో సైన్సు, లెక్కలు వంటివి ఉన్నాయి. మానసిక ఆనందం, ఉల్లాసం దాగిఉన్నాయి. సంక్రాంతి వచ్చిందంటే అతివల్లో దాగివున్న ఈ ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు సైతం నిర్వహిస్తున్నారు. రేపటితరానికి వీటిని నేర్పించాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉన్నది.

- వాణీ ప్రభాకరి