Others

ఆచరణకు ఆమడ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకు పూర్వవైభవం తెచ్చేందుకు అధ్యయన కమిటీ వేశామని చెబుతున్న పాలకులు ఏటా ఏవో సభలు, సమావేశాలు జరపడం తప్ప ఆచరణలో ఏమీ కనిపించడం లేదు. సలహాలు, సూచనలివ్వండంటూ కాలయాపన చేస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు నివసించే ఇతర రాష్ట్రాల్లోనూ పర్యటించి, వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పిందే చెపుతున్నారు. తెలుగు భాషకు ఈ దుస్థితి ఏర్పడడానికి రెండు దశాబ్దాల క్రితమే ప్రాథమిక విద్యలో తెలుగు పాఠ్యాంశాలను తీసేసిన పాలకులు ఇప్పుడు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు.
తెలుగు భాషకు అగ్రపీఠం వేసేందుకు, దాన్ని పాలనాభాషగా అమలు చేసేందుకు, లలితకళలకు పునరుజ్జీవనం కల్పించేందుకు గత ఏడాది మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సాక్షిగా నేతలు పునరుద్ఘాటించారు. ఆ ప్రమాణాలన్నీ బుట్టదాఖలయ్యాయి. పదవ తరగతి వరకు తెలుగులోనే విద్యాబోధన జరిగేలా కృషిచేస్తామని మంత్రులు డాంబికాలు పలికారు. ఏ సభ పెట్టినా చెప్పిందే చెప్పడం, భాషాభిమానులు విన్నదే వినడం తప్పించి కార్యచరణ శూన్యం.
ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్, వందకోట్లతో కూచిపూడి అభివృద్ధి, కవులకు గౌరవ వేతనం, పెన్షన్ స్కీమ్‌లు, ప్రమాద బీమా ఏర్పాట్లు వంటి హామీలు వాగ్దానాలకే పరిమితమవుతున్నాయి. నేతలు ఏడాదికి నాలుగు వేదికలెక్కి ఉత్తుత్తి ఉపన్యాసాలివ్వమంటే ముందంజలో ఉంటారు. మరోవైపు ప్రభుత్వ గ్రంథాలయాలు వసతులు లేక దీనావస్థకు చేరుకుంటున్నాయి. వీటిలో తగినంత సిబ్బంది, కొత్త పుస్తకాలు, ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కానరావు. ఇదివరకు రాజారామ్‌మోహన్ రాయ్ లైబ్రరీ ట్రస్ట్ నేరుగా దేశవ్యాప్తంగా గ్రంథాలయాలకు ఉచితంగా పుస్తకాలను అందించేవి. భాషాభివృద్ధికి దోహదం చేసే గ్రంథాలయాలపై చిరకాలంగా పాలకులు శీతకన్ను వేశారు. వీటి అభివృద్ధికి బడ్జెట్‌లో ఏనాడూ తగినన్ని నిధులు కేటాయించిన సందర్భాలు లేవు.
ఇంగ్లీషు పుణ్యమాని ఇపుడు తెలుగు భాష సంకరమైపోయిందని, మాతృభాషను పరిరక్షించుకోవాలని పాలకులు వేదికలపై ఎంతో ఆవేదన చెందుతుంటారు. అంతర్జాలంలో ఆంగ్లభాషతోపాటు తెలుగు ఉండేలా చర్యలు తీసుకుంటామని వారు భరోసా ఇస్తారు. పాఠశాలల్లో తెలుగు భాషా పండితులను నియమించేందుకు చర్యలు తీసుకున్నామంటారు. ఏళ్లు గడుస్తున్నా నియామకాల సంగతి తేలదు. ఉత్తుత్తి హామీలు, కాలక్షేపం సభల ద్వారా తెలుగు భాషకు ఒరిగేదేమీలేదు. తెలుగు భాష గొప్పదనం విశ్వవ్యాప్తం కావాలని ప్రపంచ తెలుగు మహాసభలను తరచూ అట్టహాసంగా నిర్వహిస్తే సరిపోదు. లక్షలకు లక్షలు సభలకే ఖర్చుపెట్టి ఫలించని తీర్మానాలు, వాగ్దానాలు, పట్టుశాలువాలతో ఒకర్నొకరు సన్మానించుకోవడం, రుచికరమైన విందు భోజనాలు ఆరగించడం, భుజాలు ఎగరేసుకోవడం.. ఇంతకుమించి సాధించింది ఏదీలేదు. ఇదే రీతిలో నేడు ‘తెలుగు భాష అధ్యయన కమిటీ’ కూడా వ్యవహరిస్తోంది. కమిటీ సభ్యుల పర్యటనలు తప్ప- ఆచరణలో ఫలితం ఏమీ కనిపించడం లేదు. మొత్తానికి తెలుగు భాష భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.

- అడపా రామకృష్ణ