Others

ఉప్మా చాయ్‌వాలీ టీ అమోఘం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ‘ఇండియా, ఆస్ట్రేలియా కమ్యూనిటీ’ అవార్డులలో ‘ఉత్తమ వ్యాపారవేత్త’ అవార్డు అందుకున్న కుమారి ‘ఉప్మావీర్దీ’ మార్కు టీ అంటే ఆస్ట్రేలియన్లు పిచ్చెత్తిపోతున్నారు.
ఈ టీ కొట్టు చిట్టెమ్మ ఆస్ట్రేలియన్లకి ఆనందం, ఆరోగ్యం ఇచ్చే ‘చాయ్‌వాలీ’- భారతీయ (పంజాబ్)మూలాలు గల అద్భుత యువతి- కుమారి ఉప్మావీర్దీ(26) మెల్‌బోర్న్‌లో చాయ్ షాప్ ఏడాదిక్రితం మొదలెట్టింది. ఎవరూ గుర్తించలేదు కానీ, ఏడాది తిరగకుండానే సిడ్నీలో ఉత్తమ వ్యాపారవేత్తగా అవార్డు అందుకుంది.
‘‘ఉప్మా అంటే పెసరట్టులో తినే ఉప్మా కాదండీ! నా పేరు సిఖ్ఖుల పవిత్ర గ్రంథం నుంచి తీసిపెట్టారు మావాళ్ళు. పైగా ఆస్ట్రేలియాలో అందరూ ‘చాయ్ టీ’ అంటూ, అడుగుతూంటే, పేపరు కాగితం అన్నట్లు ‘చాయ్ టీ’ అనకూడదు. ‘చాయ్’ అనాలి. లేదా ‘టీ’ అనాలి అని చెప్పాను అంటుందామె. చిన్నతనంలో వాళ్ళ తాతగారు బేబీ ఉప్మాకి టీ త్రాగటం, చెయ్యటం కూడా అలవాటుచేశారు. అది మామూలు టీ కాదు, సుగంధ పరిమళభరిత వనమూలికల తేనీరది.
ఆస్ట్రేలియాకి స్కాలర్‌షిప్‌మీద వెళ్లిపోయి, ప్రథమ శ్రేణిలో లాయర్ అయిపోయిన కుమారి ఉప్మాకి ఈ టీ ఒక వ్యామోహం, ఒక ఆదర్శం, ఒక వ్యాపారం అయిపోయాయి. అమ్మా, నాన్నా అంటున్నారు- ‘పెళ్లిచెయ్యాలే అమ్మాయ్! నీకు. చాయ్ వాలీ అంటే ఎవడొస్తాడే’’ అని. ‘‘కానీ, యివాళ ఒక చాయ్‌వాలా దేశ ప్రధాని అవలేదా?’’ అనికూడా వాళ్లే అంటున్నారు. కాలం మారిందోచ్!
కుమారి ఉప్మా- ‘‘స్ర్తిలే యింటిదీపాలు. వాళ్లే అసలు సిసలు చాయ్ పెట్టగలవారు. కనుకనే నేను ‘చాయ్‌వాలీ’ని అయినాను’’ అంటోంది.
అదే బ్రాండ్‌తో ఆమె ఆయుర్వేదయుక్త ఆరోగ్య చాయ్‌ని బ్రాండ్ విలువలున్న నెంబర్‌వన్ టీగా చేసింది. త్వరలో ఇండియాకి రుూ చాయ్‌వాలీ బ్రాండు దిగినా ఆశ్చర్యపోనక్కరలేదు.
‘‘చాయ్ మనుష్యుల్ని కలుపుతుంది. ఉత్తేజాన్నీ ఉల్లాసాన్నీ యిస్తుంది’’ అంటుందామె. ‘‘ఇది నా ‘మొగుడు’లాంటిది. కాఫీ కూడా యిష్టమే కానీ అది ‘బోయ్‌ఫ్రెండ్’లాంటిది అని కూడా అంటుందామె చతురంగా. బ్రహ్మాండమైన మార్కెట్ ఆమె బ్రాండ్‌కి. పార్టీలలో చాయ్‌వాలీదే పైచెయ్యి. ‘ఈట్ స్లీప్ చాయ్ రిపీట్’ అన్నది ఆమె ‘టీషర్టు’ల మీది స్లోగన్! ఈ చాయ్‌వాలీ- ‘‘నాకు మన ఇండియన్ కల్చర్‌ని, యిక్కడ ఆస్ట్రేలియన్లకు అవగాహన వచ్చేలాగా చేయడమే నా ధ్యేయం’’ అంటుంది. వైన్, విస్కీ బార్‌లకన్నా రుూమె చాయ్ కేంద్రాలకి నాగరికులు వచ్చి వాలిపోతున్నారు. విద్యావతి, వినయశీలి, మాతృదేశ భక్తి కలగలిపిన చాయ్‌వాలీ- మనకి కూడా గర్వకారణమే! చాయ్‌వాలీ టీ అమోఘం!!