ఐడియా

ఒక్క ఐడియా ఇంటినే మార్చేస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న చిన్న కుటుంబాలు తయారయ్యాయి. తాతయ్య, అమ్మమ్మలు, బామ్మలు తగ్గిపోయారు. ఉన్నా వారి మాటలకు కొన్ని చోట్ల విలువ కరువైపోతోంది. దీంతో ఈ చిన్న కుటుంబాలు ప్రతీ చిన్న విషయానికి, సమస్యకు ఏమీ తోచక చిరాకు పడుతూ, గోరంతవి కొండంత చేసుకుంటున్నారు. ఇంట్లో తరచూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా కొన్ని ఐడియాలతో తొలగించుకోవచ్చును.
* పిల్లలకు ఆటల్లో, ఇంటివద్ద చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాపు వస్తుంది. టీ కాచుకున్నాక ఆ టీ పొడిని మెత్తటి క్లాత్‌లో పెట్టి మూడు పూటలా వత్తితే వాపు, నొప్పి తగ్గుతుంది.
* దురదగా వున్న చర్మానికి చెంచె దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి రాస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
* నిత్యం ఇంట్లో లేదా నీడ పట్టులో వున్నవారికి విటమిన్ డి అవసరమైనంతగా దొరకదు. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఎండలో నడవాలి.
* పిల్లలకు దుస్తుల ఖరీదు తెలీదు. వాటి విలువా తెలియదు. వారి పని దుస్తులను ఇష్టానుసారంగా వాడడమే. ఈ సమయంలో వాటిపై ఇంకు మరకలు పడుతుంటాయి. వీటిని కొద్దిగా బేకింగ్ సోడాతో రుద్దాలి. అలాగే వెనిగర్‌లో ముంచి ఉతికితే ఆ మరకలు పోతాయి.
* ఉల్లి తర్వాత తల్లి నిమ్మకాయ. దీనిని వినియోగించుకున్నవారికి బోలెడు ప్రయోజనాలు! పిండేసిన నిమ్మకాయ తొక్కల్ని తొక్కే కదా అని పారేయకండి. కుక్కర్‌లోపల మరకలు పట్టకుండా ఉండాలంటే ఈ తొక్కల్ని అడుగున పడేసి వండుకోండి.
* నోరూరించే తీపి పదార్థాలు, జీడిపప్పు వంటివి పాడవకుండా కొద్దిగా ఎత్తుగా వున్న స్థలంలో పెట్టండి. దిగువన దాని చుట్టూ చీమల మందు చల్లండి. అప్పుడు మీకు చీమల దండు కనిపించదు. మీ పదార్థాలు భద్రంగా ఉంటాయి.
* గోళ్లు బాగా పగిలిపోయాయా? అయితే అవి ఈజీగా నెయిల్ కట్టర్‌తో రావాలంటే గోళ్ళు తీసుకునేమందు మీ దుస్తులను మీరే ఉతుక్కొని తర్వాత గోళ్ళు తీసుకోండి. ఈజీగా వచ్చేస్తాయి.
* అందమైన ఆరోగ్యానికి వారానికి మూడు రోజులు ఆకుకూరలు వండుకోండి. ఎ, బి, సి, ఇ, కె తదితర విటమిన్లు పుష్కలంగా వుంటాయి. అలాగే పిల్లలకు ప్రతీరోజూ చెంచా తేనెను ఇవ్వండి. ఆరోగ్యంతోపాటు అందంగా పెరుగుతారు.
* వంటింట్లోని బియ్యం డబ్బాను నెలకోమారు చూసుకోండి. బొద్దింకలు, చిన్న చిన్న సాలీడ్లు అడుగున, చుట్టూ చేరి వుంటాయి. దీనిని పరిశుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టండి. తర్వాత బియ్యం వేసేముందు లోన కొద్దిగా పసుపు పొడి, లేదా పుదీనా పొడి చల్లండి.. చీమలుండవు.
* నెలకు రెండు, మూడుసార్లు ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా కాకరకాయ కూర వండిపెట్టండి. కష్టంగానైనా తినమనండి. ఒంటికి ఆరోగ్యం, కడుపులో వున్న నులిపురుగులు పోతాయని నచ్చచెప్పండి.
* పసందైన ఇడ్లీల కోసం ఇడ్లీ పిండిలో కొద్దిగా నూనె కలపండి. అప్పుడు ఇడ్లీలు మృదువుగా ఉంటాయి.
* గదులు శుభ్రం చేసేటప్పుడు ఫినాయిల్ వాసన మీకు పడదా? అయితే, ఆ నీటిలో పసుపు ముద్దగా నూరి వేయండి. శుభంకు శుభం.. ఆరోగ్యానికి ఆరోగ్యం. పసుపు ఏ విధంగా వాడినా కీటకనాశిని కదా.
* ఇంట్లో నిత్యం వాడే కుర్చీలను కూడా పరిశుభ్రంగా ఉండాలి. అందుకే సెలవుపూట ఇంటిల్లిపాది కలిసి కుర్చీల పని పట్టండి. పాతబడిపోయిన టూత్‌బ్రెష్‌ను వినియోగించండి. పరిశుభ్రంగా తయారై చూడడానికి నిగనిగలాడుతుంటాయి. అలాగే, కంప్యూటర్ కీబోర్డుల్లో ధూళి, దుమ్మూ పేరుకుపోయి వుంటే టూత్‌బ్రెష్‌ను లేదా ఇయర్‌బడ్స్‌తో క్లీన్ చేయండి. వౌస్‌ను, కీబోర్డును వారానికి ఒకసారైనా డెటాల్ కలిపిన తడిగుడ్డతో శుభ్రం చేస్తే వ్యాధులు దరిచేరవు.

-జి.కల్యాణి