AADIVAVRAM - Others

విగ్రహాలు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరి రోడ్డు మీద, చౌరస్తాలలో విగ్రహాలు తక్కువ. రోడ్డు మీద ఓ ఇంటి మూల మీద ఓ జైనుని విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు మాలో ఉదయించేవి. పెద్దవాళ్లతో మాట్లాడి మాలో వచ్చిన ప్రశ్నలకి జవాబులని వెతుక్కునేవాళ్లం.
మా ఊరిలోని ప్రాంతాలకి కొందరి పేర్లు వుండేవి. జాతీయ నాయకులకన్నా మా ఊరి వాళ్ల పేర్లు ఎక్కువగా వుండేవి. మేముండే ప్రాంతం పేరు సుబ్రహ్మణ్యనగర్ అని, కొంత పైకి వెళ్లితే సాంబకవి నగర్ అని వున్నాయి. ఒకతను డాక్టర్ సుబ్రహ్మణ్యం, రెండవ వ్యక్తి మామిడిపల్లి సాంబశివ శర్మ.
డా. సుబ్రహ్మణ్యం ఆయుర్వేద డాక్టర్. ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా వైద్యం చేశాడు. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకునేవాడు. ప్లేగు వ్యాధి వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా ఆయన భయపడక అన్ని ప్రాంతాలని సందర్శించి వైద్యం చేసేవాడు. మా ఊళ్లో హైస్కూల్ రావడానికి ఆ కాలంలో బాగా కృషి చేసిన వ్యక్తి డా.సుబ్రహ్మణ్యం. అతన్ని గుర్తు చేసుకోవడానికి మా ఊరిలోని ఓ ప్రాంతానికి అతని పేరు మీద సుబ్రహ్మణ్య నగర్ అని పేరు పెట్టారు. చాలా మంది ఇళ్లల్లో ఆయన ఫొటోలు ఇప్పటికీ కన్పిస్తాయి. ఆయన్ని ఆ తరం వాళ్లు ఎవరూ మరచిపోలేదు. ఈ తరం వాళ్ల కోసం ఆయన పేరు మీద ఓ ప్రాంతం.
మామిడిపల్లి సాంబశివ శర్మ మంచి పద్యాలు రాశాడు. ఆశువుగా పద్యాలు చెప్పేవాడు. వేములవాడ రాజేశ్వరుని సుప్రభాతం రాసింది ఆయనే. మా ఊర్లో కవి సమ్మేళనం జరిగినప్పుడు అతన్ని చివర్లో పెట్టేవాళ్లం. చివరి కవి అతనే. అతనికి కాలపరిమితి లేదు. పది నిమిషాల నుంచి అరగంట వరకు అతనితో కవిత్వం చదివించుకునేవాళ్లం. మంచి గొంతు. మంచి కవిత్వం. ఎప్పుడైనా ఏదైనా అర్థం కాకపోతే, దాన్ని విడమర్చి చెప్పేవాడు. అతను కష్టాల్లో ఉంటే మేమందరం కలిసి రెండు మడిగెలు (షాపులు) కట్టించాం. వాటి మీద వచ్చే కిరాయితో అతని జీవనం గడిచేది. ఆయనకి గుర్తుగా సాంబకవి నగర్ పేరు పెట్టారు.
జాతీయ నాయకుల పేర్ల మీద ప్రాంతాలకి పేరు పెట్టకుండా ఆ ఊరికి సేవ చేసిన వ్యక్తుల పేర్ల మీద కొన్ని ప్రాంతాలకి పేర్లు పెట్టడం చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు గుర్తించాలి.
ఈ మధ్య ఓసారి మా ఊరికి వెళ్లినప్పుడు మా అనురాగ్ దృష్టి ఈ పెద్దవాళ్ల పేర్ల మీద వున్న నగర్‌ల మీద పడింది. వాడి ప్రశ్నలకి వివరంగా ఆ పెద్దవాళ్ల గురించి చెప్పాను. దేశానికి సేవ చేసిన వ్యక్తులకన్నా వాడిని ఈ వ్యక్తులు బాగా ఆకర్షించారు. అమెరికాలో వుంటున్న వాడికి మా ఊరికి ఏమైనా చెయ్యాలన్న కాంక్ష మొదలైంది.
మంచి పనులు ఎవరు చేసినా వారిని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే తరాలకి గుర్తుండేలా వారి పేర్ల మీద ఏదో ఒకటి చేయాలి. వారి స్ఫూర్తి భవిష్యత్తు తరాలకి అందేలా చూడాలి. వారి గురించి ఓ నాలుగు మాటలు కూడా ఆ నగర్‌లోని కూడళ్లలో ప్రదర్శించాలి.
ప్రతి ఊరు ఆ ఊరికి సేవ చేసిన వ్యక్తులని గుర్తించి, వాళ్లని మరచిపోకుండా, గుర్తుండేలా ఏదో ఒకటి చేయాలి. విగ్రహం అక్కర్లేదు. ప్రాంతానికి వాళ్ల పేరు పెడితే చాలు. జాతీయ నాయకులకన్నా ఈ వ్యక్తులు ఆ ఊరి ప్రజలకి ఎక్కువ స్ఫూర్తిని ఇస్తారు.