Others

డిజిటల్ ఇండియా ఇంకెంత దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్ర జలంతా ఆ విధానాలను అలవాటు చేసుకోవాలని ప్రోత్సాహకాలూ ప్రకటిస్తోంది. ఇప్పటికే ‘డిజిటల్ ఇండియా’ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు ‘డిజిటల్ ఎకానమీ’పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘అసోచామ్-డెలాయిట్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది. ఆ అధ్యయనంలో కీలక అంశం ఏమిటంటే.. దేశంలో దాదాపు వందకోట్ల మందికి ఇంటర్‌నెట్ సౌలభ్యం ఇంకా అందుబాటులో లేకపోవడమే. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎకానమీ సాధ్యమేనా? అన్నది ప్రశ్న.
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం ప్రగతిదిశగానే సాగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, వాటికి సంబంధించిన మొబైలై డేటా ప్లాన్ ఆఫర్లు కారుచౌకగా లభిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ల ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. వినియోగదారులు భరించగల ధరలలో నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు, స్మార్ట్ పరికరాలు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే ‘డిజిటల్ లిటరసీ’పై ప్రజలకు అవగాహన పెరిగి లక్ష్యం సాధించడం సులభతరం అవుతుందని అసోచామ్, డెలాయిట్ అధ్యయనంలో వెల్లడైంది. ‘సైబర్ నేరాలను అరికట్టడానికి తీసుకోవలసిన జాతీయ వ్యూహాత్మక చర్యలు’ అన్న అంశంపై ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడానికి ప్రస్తుతం అందిస్తున్న వౌలిక సౌకర్యాలు సరిపోవు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత డిజిటల్ ఎకానమీ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజలకు అవగాహన కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో డిజిటల్ లిటరసీపై సంస్థాగత శిక్షణ ఇస్తే ఫలితం కనిపిస్తుంది. ఈ శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచస్థాయిలో రాణిస్తున్న టెక్నాలజీ దిగ్గజాలతో ‘స్కిల్ ఇండియా’ శిక్షణ పొందిన నిపుణులు కలసి పనిచేయాల్సి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సంయుక్తంగా శిక్షణ అంశాలను, కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంటుందని అసోచామ్ సూచించింది. టెక్నాలజీతో కలిగే లాభాలు, దాని అవసరంపై ప్రజల్లో, ముఖ్యంగా బలహీన వర్గాల్లో చైతన్యం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలు చొరవ తీసుకుని వౌలిక వసతుల కల్పనలో భాగస్వాములు కావాలని సూచించింది. వినియోగదారుడికి ఉపయోగపడే ‘యాప్స్’ ఇతర సదుపాయాల కల్పనలో ‘స్టార్టప్’ కంపెనీలు తోడ్పాటు అందించాలని ఈ అధ్యయనం పేర్కొంది. బలహీన వర్గాలు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగంలో టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకునేందుకు అయ్యే వ్యయం భరించగలిగే స్థితిలో లేకపోవడమే పెద్ద అడ్డంకిగా మారింది. డిజిటల్ లిటరసీ విషయంలో మనవాళ్లు వెనకబడి ఉండటం, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం అడ్డంకిగా మారింది. డిజిటల్ లిటరసీపై విస్తృత ప్రచారం, ప్రజల్లో అవగాహన, మారుమూల ప్రాంతాల్లోకూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా చూడటం, చౌకగా స్మార్ట్ఫోన్లు, మొబైల్ ప్యాకేజీ సేవలు అందుబాటులోకి రావడం వంటి పరిణామాలు ఎంత త్వరగా జరిగితే ‘డిజిటల్ ఇండియా’ లేదా ‘డిజిటల్ ఎకానమీ’ అంత వేగంగా సాకారమవుతాయని ఆ నివేదిక పేర్కొంది.

-కృష్ణతేజ