Others

కేకో కేక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సర ఆరంభ ఘడియలను ఆస్వాదించాలన్న ప్రజలు ఉత్సాహం కేకులు, పండ్లు, పూల బొకెల కు విపరీతమైన డిమాండ్ సృష్టించింది. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకునేందుకు ఒట్టి చేతులతో వెళ్లకుండా పూల బొకేలు, పండ్లు తీసుకువెళ్ళే సంప్రదాయం ఆనవాయితీగా మారడంతో కేకులు, పూలు, పండ్లకు రెక్కలొచ్చా యి. ఎంగేజ్‌మెంట్, రిటైర్‌మెంట్, పండుగలు, పర్వదినాలు, వార్షికోత్సవాలు, వసంతోత్సవాలు- ఇలా వేడుక ఏదైనా కేకు ఉండాల్సిదే. పండుగలు, పిల్లల అభిరుచిని బట్టి వివిధ రకాల కేకులు తయారుచేయడానికి తయారీదారులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల డ్రీమ్ క్యారెక్టర్లు, ట్రైన్, బస్, విమానం, పడవ, వివిధ రకాల బొమ్మల జంతువులు, మనుషులు, పక్షులు, గార్డెన్‌లు, జలాశయాలు, పుష్పాలు, స్విమ్మింగ్ పూల్స్, వాహనాలు, బహుళ అంతస్తులు- ఇలా ఒక్కటని కాదు అనేక రకాలు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఆయా విశేషాలు ప్రతిబింబించేలా ఇష్టమైన తారల పుట్టిన రోజుకు వారి బొమ్మలతో కూడిన కేకులు వంటివి సర్వసాధారణమయ్యాయి. సరదాతోపాటు రికార్డులకోసం, నలుగురినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనూ తయారుచేస్తున్న కేకులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
కొత్త సంవత్సర ఆరంభ ఘడియల్లో 31వ తేదీ అర్ధరాత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకుని వేడుక చేసుకునేందుకు అన్ని వర్గాలప్రజలు ప్రాధాన్యతనివ్వడంతో కేకులు హాట్ కేకులే అయ్యాయి.

- టి. మూర్తి