AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి గురించి చెప్పేది ఇలా కొనసాగించాడు.
‘రామా! ఆ కామధేనువు వశిష్ఠుడికి ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తుంది. అలా అది చెరకు గడలు, వివిధ రకాల తేనెలు, పేలాలు, మద్యాలు, పానీయాలు, పప్పులని, అనేక రకాల పిండివంటలని, పర్వతాలంత వేడి అన్నరాశులని, గోధుమ రొట్టెలని, కూరగాయలని, మధురాన్నాలని, కాలువల్లా పారే పెరుగుని, వివిధ రసాలు చేర్చి వండిన పదార్థాలని, బెల్లం వంటకాలని వేలకొద్దీ సృష్టించి సమకూర్చింది. వాటిని విశ్వామిత్రుడి సైన్యం, విశ్వామిత్రుడు, అతని రాణులు, పురోహితులు, బ్రాహ్మణులు, మంత్రులు, సేవకులు మొదలైన వారంతా తిని తృప్తి చెందారు.
‘పూజకి అర్హుడవైన నువ్వు నన్ను పూజించావు. నీకు కోరినన్ని ఆవులను ఇస్తాను. కామధేనువుని నాకు ఇవ్వు. ఈ ఆవు రత్నం లాంటిది. రత్నాలు రాజు సొమ్ము. ఇది నాకు చెందుతుంది. కాబట్టి ఇవ్వు’ విశ్వామిత్రుడు కోరాడు.
‘రాజా! నువ్వు లక్షలు లేదా కోట్ల ఆవులని, వెండి రాసులని ఇచ్చినా సరే, నేను శబలని ఇవ్వను. ఈ ఆవుకీ, నాకూ గల సంబంధం బుద్ధిమంతుడికి, కీర్తికిగల సంబంధంలా శాశ్వతమైంది. నా హవ్యం, కవ్యం, నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రం, భూతబలి, దేవతలకి నైవేద్యాలు, అనేక విద్యలు ఈ ఆవు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇంకా అనేక ఇతర కారణాలవల్ల కూడా దీన్ని నీకు ఇవ్వలేను’
వశిష్ఠుడి ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.
‘బంగారు నడుము తాళ్లు, మెడ తాళ్లు, బంగారు అంకుశాలు గల పధ్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను. నాలుగు తెల్లటి గుర్రాలని కట్టిన, చిరుగంటల అలంకరణ గల ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను. ఇంకా మేలుజాతి గుర్రాలని ఇస్తాను. వయసులో ఉన్న అనేక రంగుల ఆవులని కోటి ఇస్తాను. రత్నాలు, బంగారం, ఇంకా ఏదైనా ఎంత కావాలో అడుగు. వాటిని ఇచ్చి శబలని తీసుకుంటాను’
విశ్వామిత్రుడు ఏం ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించలేదు.
‘ఇదే నాకు రత్నం. ఇదే ధనం. ఇదే సర్వస్వం. ఇదే జీవితం. నాకు దర్శపూర్ణ మాస యాగాలు, మంచి దక్షిణలు గల యజ్ఞాలు, అనేక ఇతర క్రియలకి కూడా ఈ ఆవే ఆధారం. నా క్రియలన్నిటికీ ఆధారమైన ఈ ఆవుని నీకు ఇవ్వను.
‘రామా! విధిలేక ఆ ఆవుని వశిష్ఠుడు ఇచ్చేశాడు. దాంతో శబలకి వశిష్టుడు తనని ఇష్టపడి ఇచ్చేసాడా అనే అనుమానం కలిగి బాధపడి, వందల కొద్దీ భటుల నించి తప్పించుకుని వాయువేగంతో వశిష్ఠుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఇలా చెప్పింది.
‘రాజ భటులు నన్ను తీసుకువెళ్తున్నారు. నువ్వు నన్ను ఇచ్చేసావా?’
దుఃఖించే సోదరితో చెప్పినట్లుగా వశిష్ఠుడు ఇలా జవాబు చెప్పాడు.
‘ఇవ్వలేదు. ఓ శబలా! నువ్వు నాకు ఏం అపకారం చేసావని ఇచ్చేస్తాను? ఆ రాజు బలవంతంగా లాక్కెళ్లాడు. నా బలం క్షత్రియ రాజైన అతని బలంతో సమానం కాదు. అతనికి గుర్రాలు, రథాలు, ఏనుగులు, కాల్బలం గల అక్షౌహిణీ సైన్యం ఉంది. అందువల్ల శక్తిమంతుడు’
‘బ్రాహ్మణోత్తమా! క్షత్రియ బలం బలం కాదు. క్షత్రియ బమలం కంటే బ్రాహ్మణ బలం దివ్యమైంది. గొప్పది. విశ్వామిత్రుడు నీకన్నా బలం గలవాడు కాదు. బ్రహ్మబలం గల నువ్వు నన్ను ఆజ్ఞాపించు. సైన్యాన్ని సృష్టించి ఆ దుర్మార్గుడి బలాన్ని, గర్వాన్ని నాశనం చేస్తాను’
‘సరే. శత్రుసైన్యాన్ని నశింపజేసే సైన్యాన్ని సృష్టించు’ వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు.
‘రామా! వెంటనే కామధేనువు అంబా అని అరిచి వందల కొద్దీ పప్లవులని సృష్టించింది. వాళ్లని విశ్వామిత్రుడి సైన్యం నాశనం చేసేసింది. విశ్వామిత్రుడు కోపంగా అనేక ఆయుధాలతో పప్లవులని చంపేశాడు. శబల మళ్లీ నూమిని కప్పివేసేంత మంది యవనులని, శకులని సృష్టించింది. బంగారు వస్త్రాలు ధరించిన వాళ్లు మండే అగ్నిలా కత్తులు, గదలతో విశ్వామిత్రుడి సైన్యాలని నాశనం చేశారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు మహాస్త్రాలని ప్రయోగించి యవనులని, కాంభోజులని, పప్లవులని చెల్లాచెదరు చేశాడు.’ (బాలకాండ సర్గ 53-54)
ఇంటికి వచ్చాక ఆశే్లష తను విన్న ఆనాటి హరికథని అమ్మమ్మ మీనమ్మకి చెప్పాడు. ఆవిడ హరిదాసు ఏడు చోట్ల కథని తప్పుగా చెప్పాడని వాటిని వివరించింది. ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
**
మీకో ప్రశ్న

శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు సామ్రాజ్యం కాంభోజ రాజ్యం ప్రస్తుతం ఏది?
**
గత వారం ప్రశ్నకి జవాబు

జమానియా, ఉత్తరప్రదేశ్
**

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1. గౌతముడి పెద్ద కొడుకు శతానందుడు. సదానందుడు కాదు.
2. రేణుకాదేవి గౌతముడ్ని చేరినట్లుగా అహల్య జమదగ్నిని చేరింది అన్నది తప్పు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు
అహల్య గౌతముడ్ని చేరింది.
3. బ్రహ్మ కొడుకు శుకుడు కాదు. అతని పేరు కుశుడు.
4. కుశనాభుడి కొడుకు గాంధి కాదు. గాధి.
5. బ్రహ్మ గోళ్ల నించి పుట్టినవారు వైఖాసన కాదు. వైఖానస.
6. విశ్వామిత్రుడు వెంటనే ఆతిథ్యానికి అంగీకరించలేదు. ప్రేమతో కూడిన ఆయన మాటలే ఆతిథ్యం అని నిరాకరించాడు. వశిష్ఠుడు తన ఆతిథ్యం తీసుకువెళ్లమని బలవంతం చేశాకే విశ్వామిత్రుడు అంగీకరించాడు.
7. కామధేనువు పేరు శబల. దీన్ని హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి