AADIVAVRAM - Others

నాకు కావాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం వస్తుందంటే ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. కానీ అవి పూర్తి చేయక ముందే కొత్త సంవత్సరం పాతబడిపోతుంది. మరో కొత్త సంవత్సరం వస్తుంది.
కొత్త సంవత్సరం అయినా పాత సంవత్సరం అయినా అందరూ కోరుకునేది ఒక్కటే అదే ‘సంతోషం’.
‘సంతోషం’ గురించి చాలాకాలంగా ఓ కథ ప్రచారంలో ఉంది. అది బుద్ధుడు చెప్పాడని కొందరు, మరొకరు చెప్పారని మరి కొందరు అంటూ ఉంటారు. ఎవరు ఆ కథ చెప్పినా అది అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.
ఆ కథలో ఓ పాత్ర ఓ ఋషిని కలిసి ‘నాకు సంతోషం కావాలి’ అని అడుగుతుంది.
అతను నవ్వి ఇలా అంటాడు - ‘నేనూ, నాకు అన్న పదాలు వదిలేయండి. అవి అహం లాంటివి. అవి మిమ్మల్ని ఇతరుల నుంచి దూరం చేస్తూ ఉంటాయి. అదొక మిథ్య. వాటివల్ల మీలో స్వార్థం ఎక్కువగా పెరిగిపోతుంది. ఇంకా కావాలి కావాలి అంటుంది. నేను నాకూ అనేవి ఆశపోతు లాంటివి. వాటివల్ల అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది. అందుకని వాటిని వదిలిపెట్టండి.’
ఋషి అక్కడితో ఆపకుండా ఇంకా ఇలా చెప్పాడు.
‘నేను, నాకు తరువాత మీరు వదిలిపెట్టాల్సింది ‘కావాలి’. కావాలి అంటే కోరుకోవడం. ఎప్పుడూ కోరుకోవడంతో మీ దగ్గర వున్న వాటిని అనుభవించడం మానేస్తారు. ఏవో వస్తాయన్న ఆశ మీద మీ దృష్టి కేంద్రీకరించడం వల్ల, అవి రాకపోవడం వల్ల అసంతృప్తికి లోనవుతుంటారు. ఇంకా ఏవో వుంటే సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటూ ఉంటారు. మీకు డబ్బు ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వున్న వాళ్లతో మీరు పోల్చుకుంటారు. అదే విధంగా కీర్తి.
‘నాకు’ ‘నేను’తోపాటు ‘కావాలి’ అన్నది తీసేస్తే మిగిలేది ‘ఏమిటీ’
‘సంతోషం’ అని ఆ పాత్ర చెబుతుంది.
ఆ పాత్రకి నవ్వు కూడా వస్తుంది.

- జింబో 94404 83001