Others

కల్మషముంటే కలతలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధేహూ గ్రామమున రామచంద్రభట్టు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు గొప్ప పండితుడు. మరియు సనాతన ధర్మాభిమాని. అతడు తుకారాము చేయుచున్న దానిని అంగీకరించక, ఆ గ్రామాధికారి వద్దకేగి ‘‘శూద్రుడగు తుకారాము వేదములు నేర్చుకుని తద్రహస్యములను అన్ని జాతుల వారికి తెలుపుచున్నాడు. మహర్షులు నిర్ణయించిన కర్మకలాపమును తూలనాడుచు భక్తియోగమే యుత్కృష్టమని బోధించుచు శ్రావ్యమగు సంగీతమును ఆధారము చేసుకొని అమాయకులను తన మార్గమునకు త్రిప్పుకొని పాడుచేయుటయేగాక, వైదిక మతమును అపవిత్రపరచుచున్నాడు. కావున వానిని శిక్షించి వైదిక మతమును కాపాడుము, అని కోరెను. అది వినిన అధికారి వెంటనే ‘‘తుకారామును దేహూ గ్రామమునుండి తరిమివేయుము’’ అని పటేలునకు ఆజ్ఞాపించెను. ఈ సంగతి తుకారామునకు తెలిసి రామచంద్రభట్టును ఆశ్రయించిన ఈయాపద తొలగిపోవునని తలచి బయలుదేరెను. అప్పుడు భట్టు ఇంద్రాణిలో స్నానము చేయుచుండెను. తుకారాము భట్టునకు నమస్కారము చేసికొనగా, అతడు ఓరీ! నీవు వర్ణాశ్రమాచార ధర్మములను మంటగలుపుచున్నావు! వేద శాస్తమ్రుల మహిమను తృణీకరించుచున్నావు. దీనివలన నీవే గాక, వినువారురు రౌరవాదినరకమునకు పోవుదురనెను. మరియును నీ ‘‘అభంగములను’’ విని లోకులు చెడుత్రోవలు త్రొక్కుచున్నారు. కావున ఇకముందు నీవు అభంగములను చెప్పరాదు! అని శాశించెను. తుకారాము శిరమున పిడుగుపడినట్లయ్యెను. దుఃఖించెను. ‘‘అట్లయిన ఇదివరకు చేసిన అభంగముల మాటయేమి? అని అడిగెను. వెంటనే భట్టు ‘‘వానిని కట్టగట్టి ఇంద్రాణీ నదిలో విడువుమని చెప్పెను.
తుకారాము దుఃఖితుడై ఆ అభంగములను కట్టగట్టి విఠోబా ఆలయమున కరిగి ‘‘ప్రభూ! రుక్మిణీ నాయకా! నాడు అభంగములను రచింపుమంటివి. నేడు ఈ బ్రాహ్మణోత్తముని ద్వారా వానిని నదిలో విడువుమని ఆజ్ఞాపించితివి’’ అని చెప్పి వాటిని నదిలో వైచి, వెక్కివెక్కి యేడ్చుచు వెడలిపోయెను. ఈ వార్త గ్రామమునందే గాక చుట్టుపట్ల కూడా తెలిసెను. ఇంతలో ‘‘విఠోబా’’ గ్రామమునందలి అనేకులకు స్వప్నమునందు కన్పించి, ‘‘తుకారాము అభంగములు నదిలో భద్రముగా నున్నది. వాటిని బైటకు తీసి అతనికి సమర్పించుడు’’ అని చెప్పెను. మహానందముతో వారట్లే చేసిరి.
పిదప భట్టు శిష్యునితో కూడ ఒక క్షేత్రమునకు బయలుదేరెను. ఆ గ్రామము చేరి అతడొక మహమ్మదీయ ఫకీరు తోటలోని నూతి చెంత స్నానము చేయుచుండెను. అపుడు తదధిపతియగు ఫకీరు వచ్చి ‘‘నీ వృత్తాంతమేమి?’’ అని యగుగగా భట్టు మ్లేచ్ఛుడగుటవలన అతనిని గౌరవించకపైగా తూలనాడెను. అందుకాగ్రహించి ఫకీరు భట్టును తిట్టెను. స్నానమైనది. భట్టు శరీరమున మంటలు ప్రారంభమయ్యెను. చూచు చుంగానే అవి పెరిగిపోయినవి ఇక భట్టు కూర్చుండ జాలడు, నిలువజాలడు, పండుకొన జాలడు. ఏమియు చేయునది లేక జ్ఞానేశ్వరుని మఠము చెంత కరిగి ప్రార్థించెను. స్వప్నమున జ్ఞానేశ్వరులు కన్పించి ‘‘నీవు తుకారామునకు కలిగించిన బాధలకు ఇది ఫలము. కావున అతని పాదములు పట్టుట కంటె నీకు తరుణోపాయము లేదు’’ అని చెప్పెను. భట్టునకు గొప్ప బిక్కు కలిగెను. మంటల బాధ యొకటి, తుకారామునాశ్రయింపవలసిన బాధయొకటి. అయనను దారిలేక లజ్జితుడై తన అవస్థ తెలుపుచు కటాక్షింపవలసినదని తుకారామునకు ఒక లేఖ వ్రాసెను తుకారాము దానిని చదువుకొని అహంకార, మమకార వర్జితుడు గావున మనోవికారములకు లోనుగాక, ‘‘మనస్సున కల్మషములేనివానికి, శత్రువులు లేరు. ప్రాణికోటి యంతయు సమానమే. విఠోబాదేవుని శరణు పొందుము అని వెంటనే యొక యభంగము వ్రాసి పంపెను. దానిని చదివిన వెంటనే భట్టు మంటలు చల్లారెను. తక్షణమే తుకారాము దర్శనమునకై బయలుదేరెను. ఈ సంగతి ఎరిగి తుకారాము ఎదురేగి సాష్టాంగ నమస్కారము చేసెను. అంత భట్టును ‘ ‘అపరాధిని, క్షమించుడు’’ అనుచు సాష్టాంగముగ బడి. ‘‘మిమ్ము తూలనాడుటవలన మీ అభంగములను నదిలో పారవేయించుటవలన నేను యమయాతన అనుభవించితిని. మీ క్రొత్త అభంగము చూడగనే నా మంటలు చల్లారెను. నన్ను మీ శిష్యకోటిలో చేర్చుకొనుడు.’’ అని ప్రార్థించి పాదము పట్టి, ఉపదేశము పొంది. విఠోబాను స్మరించుచు భజనను ప్రారంభించెను.
వేదములు చెల్లించుట చేత, శాస్తమ్రును అభ్యసించుట చేత, నేను లభ్యపడువాడను గాను, ఎవరు మనస్సుతో ధ్యానము చేయునో వారినే వరింతును. వారు నన్ను వరించును. భక్తునకు అనేక కష్టములు వచ్చుచున్నను భక్తిని మానరాదు. ధ్యానము మానరాదు.

- వడ్డూరి రామకృష్ణ