Others

నాకు నచ్చిన చిత్రం-- శుభ సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన -శుభసంకల్పం గుర్తుండిపోయే చిత్రం. అప్పటివరకూ దర్శకుడిగా తెరవెనుకేవున్న విశ్వనాథ్ -మొట్టమొదటగా పూర్తినిడివి పాత్ర చేసిన చిత్రం కూడా ఇదే. దర్శకుడు మంచి నటుడైతే ఆ పాత్రకు ఎంత న్యాయం జరుగుతుందో -విశ్వనాథ్ చేసి చూపించారు. ఇక కమల్‌హాసన్, ఆమని, అతిథి పాత్రగానే కనిపించినా ప్రియారామన్ నటన కలగలిపి -విశ్వనాథ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది శుభసంకల్పం. ఆమని చనిపోయిన సన్నివేశంలో కమల్, విశ్వనాథ్‌లు కలిసి ప్రేక్షకుల్ని ఎంతగా ఏడిపించారో ఇప్పటికీ మదిలో మెదిలే దృశ్యమే. బాలసుబ్రహ్మణ్యం సంగీతంలో బీజీఎమ్‌గానీ, పాటలుగానీ నేటికీ చెవుల్లో రింగుమంటూనే ఉంటాయి. కమల్‌ను జాతీయ నటడు అనడానికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పడానికి చిత్రంలోని -జాలరి నృత్యం సన్నివేశం ఓ మెచ్చుతునక అంతే. బెస్తవాడిగా కమల్ ఒదిగిపోయాడు. గురుశిష్యులుగా, యజమాని సేవకులుగా ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్న సినిమా. గొల్లపూడిది సహాయ పాత్రే అయినా సంభాషణలతో ఆకట్టుకున్నారు. బాలు పట్టుబట్టి విశ్వనాథ్‌ను ఆ పాత్రకు ఒప్పించినట్టు అప్పట్లో పత్రికల్లో చదివాం. సముద్రంలో పడవ ప్రయాణం, ఆమని- కమల్ సరసాలు, మరణానంతర దృశ్యాలు శుభసంకల్పంలో కదిలించే సన్నివేశాలు. విశ్వనాథ్ సినిమాలన్నీ ‘ఎస్’ ఆంగ్ల అక్షరంతోగానీ, తెలుగులో ‘స, శ’లతో ప్రారంభం కావడం తెలిసిందే. ఇదీ ఆ సాంప్రదాయానే్న నిలబెట్టింది. ఆర్థికంగా అంత విజయవంతం కాలేకపోయినా, హార్ధికంగా మాత్రం నిలబడిపోయింది. ఇప్పటికీ ఎప్పుడైనా చూడాలనిపిస్తే మొబైల్‌లో, ప్రయాణంలో చూస్తూ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటాం.

-కాళిదాసు విజయచంద్ర, కావలి