Others

లోగొట్టు ఫెరుమాళ్లకు ఎరుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సకల చరాచర సృష్టికి మూలం భగవంతుడు. మనకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో ఆ భగవంతుడు ముందే నిర్ణయిస్తాడుఒకసారి ఒక వీధులు ఊడ్చేవాడి అనుభవంతెలుసుకొందాం. వీధులు ఊడ్చేవాడికి ఒకే పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. ‘‘రోజూ హాయిగా పూజలందుకొంటున్నావు, నా బతుకు చూడు ఎంత కష్టమో.. ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చేయి. నీ పనిని నేను చేస్తా అని సవాలు విసిరాడు. దేవుడు చిరునవ్వుతో సరే అన్నాడు. అయితే ఒక్క షరతు- ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు. నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు. సరే అన్నాడు ఊడ్చేవాడు. తెల్లారి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. ‘‘దేవా! నా కొత్త వ్యాపారం మొదలుపెడుతున్నాను, చాలా లాభాల వర్షం కురిపించు’’ అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు. ముందు జేబులోంచి పర్సు పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు (ఊడ్చేవాడు) ‘ పర్సు వదిలేశావు చూసుకోరా’ అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని వౌనంగా ఉండిపోయాడు. ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు. ‘‘దేవా! నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించుకుంటున్నాను, దయచూడు దేవా!’’ అంటూ మోకరిల్లాడు. కళ్ళు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కన్పించింది. ‘ఇలా దయ చూపంచావా తండ్రీ’ అని ఆ పర్సును తీసుకొని వెళ్లిపోయాడు. ‘దొంగా...’ అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చె ప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు. ‘‘దేవా! రేపు నాకు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామి’’ అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. ‘‘నా తర్వాత వచ్చిందితడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు, పట్టుకోండి’’ అన్నాడు ధనిక భక్తుడు. పోలీసులు నావికున్ని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. ‘‘ఆగండి! ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు.’’ అని అరిచేశాడు. వాని మాట విని పేదవాడిని పట్టుకొని పోయారు. సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి ద్యూటీ నుంచి తన అసలు డ్యూటికి వచ్చేశాడు. ‘‘దేవా! ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా... నేను నిర్దోషిని కాపాడాను. ఒక దోషిని పట్టించాను అన్నాడు మనోడు. దేవుడు ‘‘ఎంత పని చేశావోయ్. నిన్నసలు స్పందించవద్దన్నానా? ఎందుకలా చేశావు?’’ అన్నాడు దేవుడు నిష్ఠూరంగా. ‘అది ఏమిటి స్వామి! నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను’ అన్నాడు ఊడ్చేవాడు బాధగా. ‘‘్ధనవంతుడు మహాపాపాత్ముడు. వాడు అందరినీ దోచుకొంటాడు. వాడి డబ్బు కొంత పేదవాడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందనుకొన్నాను. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెనుతుపాను వచ్చి వాడి నావ మునిగి అందరూ చనిపోతారు. అదే పోలీసులు అరెస్టు చేసి వుంటే నావికుడు, ప్రయాణికులు బ్రతికి వుండేవారు. ఇప్పుడు చూడు.. పేదోడు జైల్లో వున్నాడు. నావికుడు చనిపోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు అన్నాడు ఆ దేవదేవుడు.ఆ దేవుని లీలలు ఎవరికీ తెలియవు. కష్టంలా కన్పించేది.. వాస్తవానికి మేలు చేయవచ్చు. తప్పులా కనిపించేది నిజానికి ఒప్పుగా ఉండవచ్చు. ఏ కాలమైనా అంతా భగవంతుని లీలా విశేషం ఒక్కటే. దుష్టశిక్షణ శిష్టరక్షణ ఒక్కటే.. అందుకే భగవంతున్ని సేవిద్దాము. జీవితాన్ని నందనం చేసుకొందాం.

- కురువ శ్రీనివాసులు