Others

నాకు నచ్చిన చిత్రం--వాగ్దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించిన ‘వాగ్దానం’ సినిమా చాలా ఇష్టం. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌బాబు నవల ‘దత్త’కు సినిమారూపమిది. సినిమాలో గుమ్మడి, రేలంగి, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, నాగయ్యలు ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రానికి సంగీతం అందించినది పెండ్యాల నాగేశ్వరరావు. దర్శకత్వం ఆచార్య ఆత్రేయ. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు సహాయ దర్శకులు.
ముగ్గురు మిత్రులు విశ్వనాథం, జగన్నాథం, రంగనాథం బాల్య స్నేహితులు. విశ్వనాధం పుట్టుకతోనే ఊరి జమీందారు. ఆ వూరిలో రోగంవస్తే సరైన వైద్యుడు లేడు. అందువలన జగన్నాథం కొడుకు సూర్యంను డాక్టరీ చదివించి ఎప్పటికైనా గ్రామంలో ఆసుపత్రి తలంపుతో ఉంటాడు విశ్వనాథం. జగన్నాథం భార్య పోయిన బాధతో తాగుడుకు బానిసై సూర్యాన్ని కలవరిస్తూ కన్నుమూస్తాడు. విశ్వనాథం సూర్యాన్ని డాక్టరు చేయడంతోపాటు తన కుమార్తె విజయను సూర్యంకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ వ్యవహారం అంతగా నచ్చని రంగనాథం, తన కొడుకు చంద్రానికి ఇచ్చి విజయ పెళ్లి చేద్దామంటుంటాడు. ఈలోగా జగన్నాథం మరణ వార్త విని తట్టుకోలేక విశ్వనాథం మరణిస్తాడు. విశ్వనాథం తన చివరికోరికగా విజయను, ఆస్తిని రంగనాథానికి అప్పగిస్తాడు.
పట్నంలో ఉంటే విజయ తన చెప్పుచేతల్లో ఉండదన్న ఆలోచనతో తన కొడుకు చంద్రం, విజయను తీసుకుని గ్రామానికి మకాం మారుస్తాడు రంగనాథం. సూర్యంకూడా డాక్టరు చదువు ముగించి గ్రామంలో పేదలకు ఉచితం వైద్యం చేయడానికి వస్తాడు. నర్సుగా రాధ సహాయంతో ఒక ఆసుపత్రి తన ఇంటిలోనే పెడతాడు. విజయకు సూర్యంగాకాక అతడి స్నేహితుడిగా పరిచయమవుతాడు. సూర్యంపై కక్షగట్టిన రంగనాథం అతని ఆస్పత్రికి ఇబ్బందులు సృష్టిస్తాడు. కొన్ని దాగుడుమూతల సన్నివేశాల కారణంగా సూర్యం విజయ కూడా విడిపోతారు. విజయను అన్నివిధాల తన చెప్పుచేతల్లో పెట్టుకొంటాడు రంగనాథం. ఆ క్రమంలోనే సూర్యానికి రాధకు అక్రమ సంబంధం అంటగట్టి విజయ మనసు విరిచేస్తాడు. చివరకు చంద్రంతో విజయను పెళ్లికి ఒప్పిస్తాడు రంగనాథం. ఈ నాటకానికి ఎదురు నాటకం ఆడి దాసు, అతని భార్య, కొడుకు కలిసి చివరకు సూర్యం, విజయల పెళ్లి జరిపించటంతో కథ సుఖాంతమవుతుంది. అవమాన భారంతో వెనుదిరుగుతారు రంగనాథం, చంద్రం. ఈ చిత్రంలోని పాటలన్నీ సందర్భానుసారంగా ఉండి ఆకట్టుకుంటాయి. ఇలాంటి చిత్రాలు ఈతరం వాళ్లు తప్పక చూసి తీరాలి.

-మాలతి కృష్ణ, కర్నూలు