Others

బాలకృష్ణే సూటబుల్ (డైరెక్టర్స్ చాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు క్రిష్
**
సామాజిక దృక్పథంతో సినిమాని తెరకెక్కించే దర్శకుడు క్రిష్. తాజాగా
రూపొందించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని సంక్రాంతి సినిమాగా 12న విడుదల చేస్తున్న సందర్భంలో మీడియాకు
ఇచ్చిన ఇంటర్వ్యూ.
శాతకర్ణి కథనే ఎందుకు తీసుకున్నారు?
నిజమే, శాతకర్ణి గురించి చాలామందికి తెలీదు. అందుకే ఆయన గొప్పతనాన్ని చూపించాలని, తెలుగు రాజులు మనకోసం ఏంచేశారన్నది తెలియచెప్పాలనే ‘శాతకర్ణి’ని ఎంచుకున్నా.
బాలకృష్ణ కోసమే స్క్రిప్ట్ రాశారా?
అవును. ఈ ప్రాజెక్టుపై తొలిరోజు పని మొదలుపెట్టినపుడే బాలకృష్ణను అనుకుని ప్రారంభించాం. ఆయన ఒప్పుకోకపోయివుంటే ఈ సినిమా ఉండేదే కాదు. ఈ పాత్రను ఆయనకన్నా బాగా వేరెవరూ చేయలేరు.
ఎలా ఒప్పించారు?
బాలకృష్ణను కలిసిన రోజునే గంట స్టోరీ చెప్పాలన్నారు. నేను కథ చెప్పడం మొదలెట్టగానే ఆయన బాడీ లాంగ్వేజ్‌లో మార్పులు గమనించా. కథ నచ్చిందని అర్థమైంది. రెండు గంటలు కథ చెప్పా. మనం సినిమా చేస్తున్నాం అన్నారంతే.
ఇంత త్వరగా పూర్తిచేశారు?
సినిమా మొదలుపెట్టడానికి ముందే అన్నీ సిద్ధం చేసుకున్నా. ఎప్పుడు ఏ లొకేషన్‌లో ఏ షాట్ తీయాలి, ఎవరు ఏ డైలాగ్ చెప్పాలి, ఏ బట్టలు వేసుకోవాలి... అన్నీ టీమ్‌తో ప్లాన్ చేశా. అందుకే ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పైగా చాలా రోజులముందే విడుదల డేట్‌ను లాక్ చేసుకున్నాం.
ఎందుకంత అర్జెంట్?
మాకున్న బడ్జెట్ లిమిటెడ్. అందుకే వృధా ఖర్చులకు పోకుండా, పొరపాటు జరగకుండా ప్లాన్ చేసుకున్నా. సో.. డెడ్‌లైన్ పెట్టుకుని సినిమా పూర్తి చేశామన్నమాట.
బాహుబలికి, శాతకర్ణికి పోలిక?
రెండు భిన్నమైన సినిమాలు. బాహుబలి ఫాంటసీ. అందుకే దాన్ని రూపొందించడానికి టైమ్ పట్టింది. శాతకర్ణి వాస్తవ చరిత్ర. కథ విషయంలో టైమ్ పెట్టలేదు. సినిమాలో డ్రామాను గ్రిప్పింగ్‌గా చెప్పా.
ట్రైలర్‌ను రాజవౌళి అభినందించారా?
రాజవౌళికి నేను పూర్తి కథ చెప్పినపుడు ఆయన నాకు గొప్ప సలహా ఇచ్చారు. కథ సహజమైనది కాబట్టి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ ఎక్కువగా వాడకుండా నేచురల్‌గా తీయమని. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ తక్కువ టైమ్‌లో పూర్తవుతుందని చెప్పారు. అలాగే చేశా.