Others

మహిళాభిమానులు.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాసు, భరణీవారి ‘ప్రేమ’ చిత్రాలే కాకుండా ప్రేమించి చూడు, ప్రేమ మందిరం, ప్రేమనగర్, ప్రేమాభిషేకం.. ఇలా అనేక ప్రేమమయ చిత్రాల తర్వాత ప్రేమాభిమానులు అసంఖ్యాకంగా పెరిగారు అక్కినేనికి. ఆ ప్రేమాభిమానం మన దేశానికే పరిమితం కాలేదు.. విదేశాల్లోనూ అక్కినేనికి మహిళాభిమానులు పెరిగిపోయారు. అక్కినేని అభిమాన కుటుంబ సన్నిహితురాలు అమెరికాలో నివసిస్తున్న అఖిలా బలరాం ఒకసారి ఒక ముఖ్య అభిమాని గురించి చెప్పిన వివరాలివి. ఆ వివరాల్లోకి వెళ్తే.. సుధాసాగర్ అనే ఆమె అక్కినేనికి పెద్ద అభిమాని. అయితే, ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్సపొందుతోంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె -ఎక్కువకాలం జీవించటం కష్టమని వైద్యులు తేల్చేశారు. క్యాన్సర్ పేషెంట్ సుధాసాగర్ జీవితంలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అది -తనువు చాలించేలోగా అభిమాని అక్కినేనిని కలిసి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించాలని, తన అభిమానాన్ని చాటుకోవాలని ఆమె తహతహలాడేది. ఈ విషయాన్ని అఖిలా బలరాం ద్వారా తెలుసుకున్న అక్కినేని -తనకున్న ఇతర పనులన్నీ రద్దు చేసుకొని సుధాసాగర్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లార్ట. దాదాపుగా రోజంతా సుధాసాగర్ వద్దే గడిపారట. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. తన చిరకాల కోరిక నెరవేరినందుకు అమితానందం పొందింది. వైద్యులు చెప్పిన కాలంకంటే ఎక్కువకాలం జీవించగలిగింది. వ్యాధి తీవ్రత ఎంతటి విషమమైనా, మానసిక ఆనందంతో దాన్ని జయించవచ్చని సుధాసాగర్ సంఘటనతో మరోసారి రుజువైంది.
అమెరికాలో మహిళా అభిమానుల శాతం అక్కినేనికి ఎక్కువగానే ఉండేది. అక్కడ వైద్యవృత్తిలో స్థిరపడిన భారతీయుల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె డాక్టర్ సరస్వతి కూడా అక్కినేని అభిమానే. అక్కినేని సరసన కూర్చున్న ముగ్గురు మహిళల్లో -వేదికమీదే అక్కినేనిని కౌగలించుకొని సభాముఖంగా ముద్దాడిన డాక్టర్ ఇందిర (అక్కినేనికి కుడిపక్కన కూర్చున్నవారు) కూడా ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సరస్వతి సహా మరికొందరు వైద్యరంగం ప్రముఖులు డాటన్‌లో ఏర్పాటు చేసిన అక్కినేని సత్కార సభ చిత్రాలివి. అమెరికాలో తన అనుభవాలను కరతాళ ధ్వనుల మధ్య అక్కినేని తనదైన సహజధోరణి ఉపన్యాసంలో వివరించటం అభిమానులకు మరింత ఆహ్లాదం, ఆనందం కలిగించాయి.
అప్పటి జ్ఞాపకాలే ఈ చిత్రాలు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717