Others

అలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ త్రిష ఈమధ్య జోరు పెంచింది. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈమధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి భిన్నమైన సినిమాలు చేస్తూ మళ్లీ నిలదొక్కుకునేందుకు యత్నిస్తోంది. కొత్తకొత్త కథలతో సినిమాలు చేస్తూ మరోవైపు గ్లామర్ డోస్ పెంచుతున్న ముద్దుగుమ్మ.. తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు రెడీ అయింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ సినిమా పేరు- ‘1818’. కొత్త దర్శకుడు రితున్ సాగర్ దర్శకత్వంలో రూపొందే సినిమా త్వరోలోనే సెట్స్‌పైకి రానుందట. ఈ చిత్రం టెర్రర్ నేపథ్యంలో ఉంటుందని, ఇందులో త్రిష హోటల్‌లో హోస్ట్‌గా కనిపిస్తుందని, ఆ హోటల్‌పై టెర్రర్ అటాక్ జరిగితే ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే ‘96’, మోహిని చిత్రాల్లో నటిస్తున్న త్రిష.. మరి ఈ భిన్నమైన సినిమాతో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.