సబ్ ఫీచర్

కుదిరితే ఓ కప్పు కాఫీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీలైతే నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ.. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చెప్పిన
పాపులర్ డైలాగ్ ఇది.
వీలైతే నాలుగు పూటలూ.. కుదరకపోతే ఓ పూటైనా కప్పు కాఫీ.. ప్రస్తుతం వైద్య నిపుణులు చెబుతున్న డైలాగ్స్ ఇవి..
ఉదయానే్న నిద్రమత్తు వదిలి, చురుగ్గా పనిచేయడానికి కాఫీ దోహదం చేస్తుంది. కాఫీ కడుపులో పడితేగానీ కాలకృత్యాలు తీరని పరిస్థితి కొందరిది. కాఫీతోనే నిద్రలేస్తారు మరికొందరు. కాఫీ తాగడమే కాదు.. ఆ కాఫీ సువాసనను ఆస్వాదించినా గమ్మత్తుగా ఉంటుందని కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నిరకాల పానీయాలు మనకు అందుబాటులో ఉన్నా కాఫీ మాత్రమే ఎవర్‌గ్రీన్ ఎప్పటికీ.. కాఫీ తాగితే ఏమయిపోతుందోనన్న భావన అనవసరం. కాఫీవల్ల కలిగే లాభాలు, ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం మనసు కాఫీ కోసం ఉరకలేయకమానదు.
కాఫీ తాగడంవల్ల గాల్ బ్లాడర్ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.
మనసు చికాకుగా ఉన్నప్పుడు కాఫీ తాగితే అప్పటికప్పుడు ఉపశమనం కలగడం తెలిసిందే. నిత్యం కాఫీ తాగితే అన్ని రకాల మానసిక చికాకులనుంచి ఉపశమనం కలిగి ప్రశాంతత చేకూరుతుంది.
నోటి, ఇసోఫగెల్ (అన్నవాహిక వాపు), ఫరింజిల్ (గొంతు ప్రాంతం), క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది.
రోజూ క్రమం తప్పకుండా కాఫీ తాగితే లివర్ సిర్రోసిస్, హెపటో సెల్యులర్ కార్సినోమ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
జీర్ణక్రియను పెంచే శరీరంలో ప్యాట్ తగ్గడానికి దోహదం చేస్తుంది. ఫ్యాటీయాసిడ్ మెటబాలిజాన్ని పెంచి శరీరంలో వేడిని అధికం చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు.
కాఫీలోగల కెఫిన్ వ్యాయామం చేసేందుకు 12.4 శాతం సామర్థ్యాన్ని అధికం చేస్తుంది. కెఫిన్‌వల్ల అలసిపోకుండా ఎక్కువసేపు వ్యాయామం చేసే ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
ఉదయానే్న కాఫీ సేవించడంవల్ల పేగుల్లో కదలికలను పెంచి సుఖవిరోచనానికి దోహదం చేస్తుంది. పెద్ద పేగు నాళాన్ని శుభ్రం చేస్తుంది.
అంతేకాదు రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగేవారికి పార్కిన్‌సన్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఉదయమే కాఫీ తాగి రోజును ఉత్సాహంగా ప్రారంభించాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక కప్పు కాఫీ తాగితే జీర్ణశక్తి దోహదం చేస్తుంది.
సాయంత్రం కాఫీ తాగడంవల్ల తాజాగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మరో కప్పు కాఫీ సేవిస్తే ఆరోగ్యకరమైన మధుర భావనతో రోజు ముగుస్తుంది. సో.. ఇది చదివాక ఇక వెళ్లి.. ఓ కప్పు కాఫీ తాగేద్దామా మరి...

- నీలిమ సబ్బిశెట్టి