Others

‘వచ్చింది సంక్రాంతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రొత్త వరిపిండితో ఇంద్రధనుసు రంగుల
ముత్యాల ముగ్గులేసి
ముగ్గుల్లో గొబ్బెమ్మలు;
గొబ్బెమ్మల కొప్పుల్లో బంతిపూలు వికసించగా
పుడమిలో చలి భోగిమంటల వెచ్చదనానికి
సిగ్గుపడి హేమంత నటనలు చేస్తున్నది
పల్లె పదాలు పాడుతూ ‘హరి హరిలోరంగ’ అంటూ
నాట్యాల హరిదాసు ముంగిళ్ళ నిలువగా
బసవన్నలు ఎర్రా, పచ్చని బట్టలేసుకొని
పసుపు, కుంకుమలతో, కాళ్ల గజ్జలతో గంతులేస్తున్నాయి.
భూమిని దున్నిన రైతన్న కళ్ళలో వెలుగు
నిండు నూరేళ్ళు బ్రతుకు పండాలని
భోగిపండ్లు పోస్తున్న తల్లులు
కూతుళ్ళు, అల్లుళ్ళ సందళ్ళ పందిళ్ళు-
గర్వాన పొంగేటి కన్నతండ్రులు
కనపడే దేవుడా సూరీడు తండ్రీ
బొబ్బట్లు, క్రొత్త బియ్యపు పొంగళ్ళు
నీకు నైవేద్యాలు
ఉత్తరాయణ సంక్రమణ వేళ

పాడి పంటల సిరులిచ్చు సంక్రాంతి లక్ష్మి
భోగ భాగ్యాల సంక్రాంతి హేల
నిలచిపోవాలి మా పసుపు గుమ్మాల లోగిళ్ళలోన.

- అనంత మురళీ చంద్ర