గ్రహానుగ్రహం

పాడే కోకిల ఏదంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత, సాహిత్యాల్లో మాధుర్యాన్ని కోకిలగానంతో పోలుస్తారు. రూపానికి, స్వరానికి హస్తిమసికాంతరం తేడా ఉన్న కోకిల చేసే వసంతగానంతో మైమరిపోని వారుండరు. ఇంతకీ అంత అందంగా పాడే కోకిల ఏదంటే...నమ్మలేని నిజం తెలుసుకోవలసి ఉంటుంది. ఎర్రటి కళ్లు, కొనదేరిన ముక్కు, నల్లని మేనితే కన్పించే మగకోయిల తన జతగా ఆడపక్షిని ఆకర్షించడానికి పడే తపనతో చేసే స్వరాపనే అది. మామిడి చిగురు తినగానే కోయిల కూసేనా అంటే నిజమోకాదో చెప్పలేంగానీ జతకోసం మాత్రం అది అలా పాటపాడుతుందన్నది నిజం. ఇక ఆడపక్షి కాస్త బూడిదరంగు మేనితో, తెల్లటి చుక్కలతో కన్పిస్తుంది. ఇది క్రిక్..క్రిక్..అటూ అరుస్తుంది. ఈ పక్షులు గుడ్లను పొదగలేవని చాలామందికి తెలుసుకదా. మగకోకిల గూళ్లవద్ద ఉన్న కాకులను రెచ్చగొట్టి అవి తమను తరిమేలా చేస్తాయి. కాకులు వెళ్లిన వెంటనే ఆడకోకిల వాటి గూళ్లలో గుడ్లుపెట్టి వెళ్లిపోతుందన్నమాట. బాగుందికదూ వాటి తెలివి.