Others

పరిపూర్ణుడు.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపద చిత్రాల్లో -ఎన్టీ రామారావు తర్వాత పరిణితి కలిగిన నటనతో మెప్పించిన నటుడు కాంతారావు. కాంతారావు తనువు చాలించిన తర్వాత మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు మాజీ మంత్రి పివి రంగారావు ఏర్పాటు చేసిన సంతాప సభ చిత్రమిది. కాంతారావు అంటే పివి రంగారావుకు వల్లమాలిన అభిమానం. కాంతారావు జీవితంలో మరచిపోలేని విధంగా అఖండ సన్మానం జరిపిన వ్యక్తి పివి రంగారావు. ఆ సన్మానం రోజున ఓపెన్‌టాప్ జీపులో హైదరాబాద్ సుల్తాన్‌బజార్ -కోఠీ ప్రాంతం నుంచి రవీంద్రభారతి వరకు అభిమానుల పూలవర్షంతో భారీ ఊరేగింపు కొనసాగింది. కన్నుల పండువగా సాగిన ఊరేగింపు శకటంలో కాంతారావుతోపాటు ఆయన సతీమణి హైమావతి, కాంతారావు సరసన పలు చిత్రాల్లో నాయికగా నటించిన రాజశ్రీ కూడా కూర్చోవటం అప్పట్లో పలువురుని ఆకర్షించింది. పంచశీల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన అలనాటి భారీ సన్మాన సభను నిర్వహించిన పివి రంగారావే, ఈ సంతాప సభ ఏర్పాటుచేసి నివాళి అర్పించి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కంట తడిపెట్టారు. కాంతారావు నటించిన, నిర్మించిన పలు చిత్రాలకు పాటలు రాసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి కాంతారావుతో తమ అనుబంధాన్ని వివరించారు. కాంతారావు మద్రాసునుంచి తరలివచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి అన్నివిధాలా సహకరించిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కెవి కృష్ణకుమారి వెలిబుచ్చిన అభిప్రాయాలు సభికులను దుఃఖసాగరంలో ముంచెత్తాయి. ఉత్తమ చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అవార్డుల కార్యక్రమంలో కాంతారావు పేరిట స్మారక అవార్డు అందించే యోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉండటం అభినందనీయం. కాంతారావు ఇకలేరన్న విషయం జీర్ణించుకోలేని అభిమానులు, సంతాప సభలో ప్రముఖుల ప్రసంగాలు విని మరింత దుఃఖితులయ్యారు. ఆ అరుదైన చిత్రం ఇక్కడ మీకోసం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717