Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగ సినిమాలకు తెలుగు రాష్ట్రాలు పట్టంగట్టాయి. బరిలోకి దిగిన హీరోలెవరినీ అసంతృప్తిపర్చకుండా విజయాలు అందించాయ. అటు చిరంజీవి ‘ఖైదీ నెం 150’, ఇటు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ థియేటర్ల వద్ద దూసుకుపోతున్నాయ. -రెండు కమర్షియల్ చిత్రాల మధ్య చిన్న బడ్జెట్‌తో వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘శతమానం భవతి’కీ సంతృప్తికరమైన ఫలితమే అందింది. పెద్ద చిత్రాలు రెండూ మంచి టాక్ అందుకోవడంతో రెండు వారాలపాటు థియేటర్ల వద్ద సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి చిన్న బడ్జెట్ చిత్రమే కనుక -వారంపాటు థియేటర్లలో నిలబడితే లాభాల బాట పట్టేసినట్టే. -ఓవర్సీస్‌లో ‘మిలియన్ డాలర్ల’ మార్క్ దాటేసినట్టు పెద్ద చిత్రాల యూనిట్ వర్గాల నుంచి కథనాలు వినవస్తున్నా అందులో వాస్తవమెంత అన్నది ఆలోచించాలి.
మరో విచిత్రం ఏంటంటే -మూడు చిత్రాల్లో హీరోలతోపాటు దర్శకులకూ కొత్త సంక్రాంతి బిగ్ బూస్ట్ అందివ్వడం. ఏడాది ఆరంభంలో దొరికిన జోష్‌తో -కొత్త సినిమాలు స్పీడ్‌గా పట్టాలెక్కి పరిశ్రమ కళకళలాడే అవకాశం ఉందన్న ఆశలు, అంచనాలు వినిపిస్తున్నాయి.