Others

కాపీలు కొట్టకుండా చైనా చిట్కా! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా అడ్వాన్స్‌డ్ దేశం. నిజంగా ‘ఆడపిల్లే’ అనిపించే ‘రోబో’ని తయారుచేసిన చైనా దేశంలో కూడా విద్యార్థులు పరీక్షలలో కాపీలు తెగకొడతారు. వీళ్లపై నిఘా వెయ్యడానికి ఎన్ని రకాల మార్గాలనో చీనా దేశం ఆవిష్కరించినా కాపీల దెబ్బకి తట్టుకోలేకపోయారు. టీచర్లు కాపలా కాయలేక ఛస్తున్నారు.
ఈమధ్య మరో ఖర్చులేని చిట్కా ప్రయోగించారు. న్యూస్ పేపర్ల పేజీలు తీసుకుని పిల్లల అంటే స్టూడెంట్ల తలకాయలు దూరేటంత కంతలు చేశారు. ఆ పేపర్లని పరీక్షలు రాస్తున్నప్పుడు తలమీదుగా మెడలో పడేటట్లుగా దూర్చారు. (జుబ్బాలు తొడిగినట్లు) అంతే! ‘‘రాయండిరా, ఇప్పుడు పరీక్షలు’’ అన్నారు.
‘‘అహూరుూ’’ రాష్ట్రంలోని ఒక స్కూల్లో రుూ పద్ధతి అమలుచేశారు. స్టూడెంట్స్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. మెడ తిప్పలేదు. ప్రక్కవాడి పేపరులోకి చూడలేదు. కాకపోతే చైనాలో చాలామంది పెద్దలు- ‘‘యిది పిల్లల్ని మరీ హింస పెట్టడంగా వున్నది’’ అంటున్నారు. ‘‘మరేం చెయ్యడం?’’ అంటున్నారు స్కూల్ అధారిటీస్.
ఇదిలా వుండగా చైనాలో ‘మార్కుల బ్యాంకులు’ ఏర్పాటుచేశారు. బాగా 80, 90 మార్కులు వచ్చిన పిల్లలు ఓ పాతికో ముప్ఫయ్యో మార్కులని - మార్కుల బ్యాంకులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. పాపం! ఫెయిల్ మార్కులో, అత్తెసరు మార్కులో వచ్చిన విద్యార్థులు రుూ బ్యాంకుల నుంచి- కొన్ని మార్కులను ‘అప్పు’గా తీసుకుంటారు. ఆనక తమకి మంచి మార్కులు రాంగానే అప్పు తీర్చేయాలి అన్నది రూలు! గానీ, అది జరుగుతుందా? అప్పు తీర్చటం అన్నది అనుమానం!

-వీరాజీ