Others

నడకతో నాజూకుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలు సౌందర్యంగా కనిపించాలంటే అందుకు తగ్గట్టు ప్రతిరోజూ తగిన వ్యాయామం అవసరం. అనారోగ్యాన్ని దరిజేరనీయకుండా కాపాడే శక్తి వ్యాయామానికుంది. కనుక స్ర్తిలు తమ చక్కదనం పెంపొందించుకోవడం కోసం, శరీరం నాజూకుగా ఉంచుకునేందుకు కనీసం కొంతసేపు నడిస్తే చాలు. అతి వ్యాయామం పనికిరాదు. ఉదయానే్న లేచి వాకింగ్‌కు వెళ్లడం చాలామంచిది. నడకవలన శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మధుమేహం వంటి రోగాలు దరిచేరవు.
వ్యాయామం చేయడంవలన ఆకలి పెరిగి ఆరోగ్యంతోబాటు గాఢనిద్ర లభిస్తుంది. చికాకు, నొప్పులు, గుండెదడ, ఆయాసం వంటివి రావు. వ్యాయామం చేసేటప్పుడు అధికంగా నొప్పులు వస్తే వాటిని కాస్త తగ్గించి చేయాలి. శరీరానికి మంచి పోషక ఆహారం అందించాలి. తాజా ఆకుకూరలు ఉపయోగించాలి. తాజా పండ్లను ప్రతిరోజూ తినాలి. పరిశుభ్రమైన నీరు ప్రతిరోజూ త్రాగాలి. నీరు పరవౌషధం అని గ్రహించాలి. ఎక్కువ కష్టపడలేనివారు ధ్యానం ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చును. ధ్యానం వలన మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ముఖంలో సౌందర్యకాంతి వికసిస్తుంది. స్ర్తిలలో చురుకుదనం, చలాకితనం ధ్యానంవలన సిద్ధిస్తుంది.
శరీరానికి తగ్గట్టు రోజుకు కొంతయినా వ్యాయామం చేయాలి. అందం, ఆరోగ్యానికితగిన రీతిలో వ్యాయామం చేసుకుంటూ ప్రతినిత్యం పోషక విలువలు కల ఆహారం తీసుకుంటే చాలు అందంగా కనిపిస్తారు. ఆనందంతో వికసిస్తారు.

-ఎల్.ప్రపుల్లచంద్ర