AADIVAVRAM - Others

వర్షం (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం లేకుండా సృష్టి లేదు. కానీ ఎప్పుడూ వర్షం ఉంటే జీవితం పరమ బోర్‌గా అన్పిస్తుంది.
చెట్లూ, చేమలు వర్షం లేకుండా మనజాలవు. అదే విధంగా మనుషులు బ్రతకలేరు.
వర్షం లాంటివే- బాధలు, కష్టాలు, వేదనలు. అవి అన్నీ జీవితంలోని ముఖ్యమైన విషయాలు. ఇవి లేకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు.
అయినా మనిషి ఆశావహ దృక్పథంలో వున్నప్పుడే మనం సుఖంగా బతగగలడు. అన్ని సమయాల్లో ఆశావహ దృక్పథంతో వుండటం కష్టం కావొచ్చు. కానీ దుస్సాధ్యం మాత్రం కాదు. ఈ వర్షం నుంచి హర్షం ఎప్పుడో ఒకసారి ఉదయిస్తుంది.
కష్టాలు అనేవి విభిన్న ప్రదేశాల నుంచి వస్తాయి. విభిన్న దిశల నుంచి వస్తాయి. ఒకటి మాత్రం నిజం. ఈ కష్టాలని ఎదుర్కోవడానికి మనం సన్నద్ధులమై ఉండాలి. ఆ రకంగా మన వ్యక్తిత్వాలని తీర్చిదిద్దుకోవాలి.
కొన్ని కష్టాలని మనం సృష్టించుకుంటాం. కొన్ని అవే వస్తాయి. ఏవి ఎలా వచ్చినా ఈ కష్టాలు మనల్ని మింగకుండా చూసుకోవాలి.
వర్షాకాలం ఎప్పుడూ ఉంటే అది కష్టమే. ప్రతి కాలమూ అంతే.

ఓ కవి దీన్ని ఇలా చెబుతాడు.

రెండు శిఖరాలు లేకుండా
ఎక్కడైనా లోయ ఉంటుందా?

విషాదం లేకుండా
ఎక్కడైనా ఆనందం ఉంటుందా?

ఆకురాలు కాలం లేకుండా
చెట్టు చిగురిస్తుందా?

మేఘాలు లేకుండా
వర్షం కురుస్తుందా?

మృత్యువు లేకుండా
జననం ఉంటుందా?

ఎక్కడైతే అంతం ఉంటుందో
అక్కడే ఆరంభం ఉంటుంది.

వర్షం గురించి ఒక విషయం గుర్తుంచుకోవాలి. వర్షం అంతమవుతుంది. సూర్యుడు వస్తాడు. భూమి ప్రకాశవంతమవుతుంది.

- జింబో 94404 83001