Others

ద్వితీయాగ్ని.. అంగిరసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగమునందు సంతోషంగలదని తాను గ్రహించుటయేకాక ప్రపంచమునకు చాటిన మహాఘనుడు అంగిరసుడు. ఈయన గొప్ప మహర్షి. సృష్టియందు ఎన్నింటిలో సృష్టించిన బ్రహ్మ సృష్టి రచన సమయమునందు తనకు అండగా యుండుటకు ముఖమునుండి కుమారుని సృష్టించి ఆయనకు అంగిరసుడు అని పేరిడెను. అంగిరస అనగా శరీరమునకు సారమయిన శ్వాస అని అర్థం. పుట్టుక తోడనే దివ్యశక్తులు ఎన్నో కలిగియున్నప్పటికి సంసారమందు అనురక్తి నామమాత్రము కలిగి తపమునకు ఏగి మరింత శక్తిమంతుడు అయ్యెను. తండ్రి అనుమతితో కర్దమ ప్రజాపతి కుమార్తెలలో ఒకరైన శ్రద్ధను వివాహమాడెను. మరీచి, అత్రి, పులుస్త్యడు వంటివారికి తోడల్లుడు. కపిల మహర్షికి బావమరిది. ఈయనకు ఏడుగురు కుమారులు మరియు ఏడుగురు కుమార్తెలు కలరు. భానుమతి, అర్చిష్మతి, హవిష్మతి వంటివి కుమార్తెల పేర్లు. అంగిరసుని ఏడుగురు కుమారులు వారి సంతతి తరువాత కాలములందు అంగిరసులుగా పిలువబడినారు. కాని మహాభారతము ప్రకారము ఇతనికి ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అను మువ్వురు కుమారులుగలరు. ఇదివరలో ఒక పర్యాయము అగ్నిదేవుడు దేవతలపై కినుక చెంది తన ధర్మము నిర్వర్తించుట మానివేసినాడు. ఎవరికి కనబడని ప్రదేశమునందు దాగుకొనెను. అగ్ని లేని ప్రపంచమును ఊహించలేము. యజ్ఞ యాగాదులు, దీపారాధన వంటలు వంటివి మృగ్యమయినవి. దేవతలు మానవులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి తమను గట్టెక్కించమని ప్రార్థించారు. అపుడు బ్రహ్మ అంగిరసుని పిలచి నాయనా నీవు అగ్ని విధులు నిర్వహించమని కోరెను. తండ్రి ఆదేశానుసారము అంగిరసుడు అగ్నివిధులు నిర్వహించుచూ అందరి మెప్పును పొందిరి. అగ్నికి బదులు ఆరాధనలు అన్ని అంగిరసునికే లభించుచుండెను. యాగమునందలి భాగములు అంగిరసునికే లభించుచుండెను. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తన ఉనికికే ప్రమాదమని గుర్తించిన అగ్నిదేవుడు బ్రహ్మ వద్దకు వెళ్లి తన పొరబాటుని మన్నించి తన స్థానము తను ఇమ్మని ప్రార్థించెను. బ్రహ్మ అంగిరసుని వెనుకకు పిలిపించి అగ్నిస్థానము అగ్నికి ఇమ్మని ప్రార్థించెను అనటంకంటే ఆదేశించెను. అంగిరసుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి అగ్ని స్థానము అగ్నికే ఇచ్చివేసెను. అంగిరసుని త్యాగబుద్ధికి ఎంతో సంతసించిన అగ్ని ఆయనకు ద్వితీయ అగ్నిస్థానం ఆయన కుమారుడు బృహస్పతి తృతీయాగ్ని స్థానము ఇచ్చి వారలను సంతృప్తిపరచెను.
ఒక పర్యాయము అగ్నిదేవుడు సప్తరుషుల భార్యలను చూచి మోహించెను. అగ్ని భార్య స్వాహాదేవి సప్తరుషుల భార్యల రూపములు ధరించి మగని సంతృప్తిపరచెను. అయినప్పటికిని అగ్ని సప్తరుషుల భార్యలపట్ల తన తీరు మార్చుకొనలేదు. అగ్నిబుద్ధిని గమనించి అంగిరసుడు కోపంతో సర్వభక్షకుడవు కమ్మని శపించెను. సప్తరుషుల భార్యలతో మీ తప్పు ఇసుమంత అయినా లేదు కాని ఆ అగ్ని చూపులు మీపై బడి మీరు మైలపడినారు కనుక మీరు ఒక విప్రుని ఇంట జన్మించి ప్రక్షాళన చెంది మీ మీ పతులను చేరుదురుగాక అని నుడివెను.
పూర్వము చిత్రకేతు మహారాజుకు ఇరువురు భార్యలున్నప్పటికిని సంతాన ప్రాప్తి కలుగలేదు. సంతానం కొరకు చిత్రకేతువు చేయని ప్రయత్నం లేదు. అంగిరస మహర్షిని తన రాజ్యమునకు పిలిపించి తన బాధ తెలుపుకొనగా అంగిరసులవారు ఆయనచేత పుత్రకామేష్ఠి యాగము చేయించగా ఆ యాగపాయసము ఆరగించి ఆయన మొదటి భార్య కృతద్యుతి గర్భవతి అయ్యెను. కాలక్రమంలో ఆమె ఒక మగబిడ్డకు జన్మ ఇచ్చెను. చిత్రకేతు మహారాజు కృతిద్యుతిలు అల్లారుముద్దుగా బిడ్డను పెంచుతుండిరి. ఇది సహించలేని చిత్రకేతువు రెండవ భార్య అసూయతో నిండి ఆ బిడ్డను ఎవరు గమనించలేని రీతిలో హతమార్చెను. విషయం తెలిసి చిత్రకేతు మహారాజు దుఃఖము ఆపుకొనలేకపోయెను. విషయం తెలిసినటువంటి అంగిరసముని నారద మహర్షితోడి అచటికి వచ్చెను. చిత్రకేతు మహారాజు అంగిరసుల పాదాలపై పడి తనను ఈ బాధనుండి తప్పించి బిడ్డను బ్రతికించమని కోరెను. అంగిరసుల వారు చిత్రకేతుతో నాయనా, ఇది అసాధ్యం. బంధాలన్నీ రుణములవలననే ఏర్పడుతాయి అని ఓదార్చెను. అయినా వినలేదు. ఇక తప్పని పరిస్థితులలో బిడ్డ ఆత్మను పిలపించి బ్రతికించెను. సంతోషముతో నాయనా అంటూ బిడ్డను కౌగిలించుకొనబోగా ఆ బిడ్డ నువ్వు ఎవరు అని ప్రశ్నించెను. నీ తండ్రిని అని బదులీయగా, ఎక్కడి తండ్రి, ఏనాటి తండ్రివి. మన ఇద్దరిమధ్య రుణానుబంధం ముగిసింది అని చెప్పి అంగిరసుల వారివైపు చూడగా ఆయన చిత్రకేతువు బిడ్డ ఆత్మను యధాస్థానముకు పంపెను.

- వేదగిరి రామకృష్ణ