Others

నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగమంత కుటుంబం నాది..

‘జగమంత కుటుంబం నాది/ ఏకాకి జీవితం నాది’.. చక్రం సినిమాలో తాత్వికతతోసాగే ఈ పాట నాకు చాలా ఇష్టం. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ కలం నుంచి జాలువారిన ఈ గీతానికి అర్థవంతమైన బాణీని అందించిన దివంగత సంగీత దర్శకుడు చక్రినీ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి.
‘జగమంత కుటుంబం నాది/ ఏకాకి జీవితం నాది/ సంసార సాగరం నాదే/ సన్యాసం శూన్యం నావె’.. పాట సందర్భోచితంగా సందేశాత్మకంగా సాగుతుంది. బరువైన గీతాలను పాడటంలో అద్భుతమైన మార్థవాన్ని పలికించగల శ్రీ ఈ గీతానికి మరింత ప్రాణం పోశాడు. చక్రి పాత్రలో నటించిన ప్రభాస్‌కు, అతన్ని ఇష్టపడే అమ్మాయి శ్రీయకు తప్ప.. పాటలో కనిపించే పాత్రధారులెవరికీ పాటగా వినిపించే చక్రి విషాద గాధ తెలీదు. ఆ సన్నివేశాన్ని దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు. కీచులాటలతో బతుకును నరకం చేసుకునే దంపతులు, కోరుకున్నది దక్కలేదని ఆత్మహత్యకు పాల్పడేవాళ్లు, రోజువారీ జీవితంలో -ప్రయత్నిస్తే పరిష్కరించుకోగల సమస్యలే అయినా భయంతో కుంగిపోయేవాళ్లు... కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా. తాను మరణిస్తానని తెలిసీ -కొత్త జీవితాన్ని ఆవిష్కరిస్తూ.. తానున్నన్నాళ్లూ తనతోపాటువున్న అందర్నీ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేసి మరణించీ విజయం సాధిస్తాడు. ఇంతకంటే గొప్ప స్ఫూర్తి ఏముంటుంది.
కథగా చూస్తే.. హీరో చక్రి (ప్రభాస్) విదేశాల్లో వైద్య శాస్త్రం అభ్యసించి, చిన్నప్పటి స్నేహితురాలినే పెళ్లి చేసుకుని వైద్య సేవ అందించే ఉద్దేశంతో ఇండియా వస్తాడు. ఆస్పత్రి ప్రారంభోత్సవం రోజున వెలుగు చూసిన ఓ నిజం -ఆశయాన్ని తలకిందులు చేస్తుంది. తనకున్న జబ్బు కారణంగా ఓ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని పెళ్లి పీటల నుంచే పరారవుతాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తట్టుకోలేరన్న ఆలోచనతో ఎవ్వరికీ చెప్పకుండా మాయమవుతాడు. అలా చక్రి జర్నీ మరణం అంచులవరకూ ఎలా సాగిందీ, అతని జీవితంలో ఎవరెవరు తారసపడ్డారు? అతని ప్రయాణంలో ఎన్ని జీవితాల్లో ఆనందాల వెలుగు నింపాడన్నది మూల కథ. అలా ఓ కాలనీలో పేరుకున్న మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధాన్ని అందించి, ఆనందకర వాతావరణంలో బాధను దిగమింగుతూ పాడే తాత్విక గీతమిది. ‘జీవితంలో అన్నిటికన్నా పెద్ద సమస్య చేతకానితనం మరణం’ అన్న చక్రి అంతరంగాన్ని ఆవిష్కరించే గొప్ప పాట ఇది. అసలు కథ తెలియని మిగిలిన పాత్రధారులకు చక్రి జీవిత సత్యాలు చెబుతున్న భావనే కలుగుతుంది. సినీ ప్రపంచంలో కొన్ని కలికి తురాయిలు అప్పుడప్పుడూ అలా వస్తుంటాయి. ఈ పాటలో -సంగీత సాహిత్యాలు సందర్భోచితంగా హృదయాన్ని ఆర్ద్రం చేస్తాయి.
-సిహెచ్ శారద, కావలి