Others

దేనికీ భయపడను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా ఏ హీరోయిన్‌కైనా ఇంత ధైర్యం ఉండాలని అందరూ అంటుంటారు. అసలు ధైర్యమే లేకపోతే హీరోయిన్‌గా నటించడం చాలా కష్టమని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. తాను దేనికీ భయపడే ప్రశే్నలేదని అప్పుడప్పుడు చెప్పే ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వెరైటీ ప్రశ్నకు అంతే వైవిధ్యం వున్న సమాధానం ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి మీరు భయపడతారా? అని అడిగితే తాను భారతీయురాలినని, భయపడే ప్రశే్నలేదని వ్యాఖ్యానించింది. ఈ సమాధానం విన్న అందరికీ ఆమెను చూస్తే ముచ్చటేసిందట. ఇంత ధైర్యంగా ఓ దేశాధ్యక్షుడి గురించి మాట్లాడడం ప్రియాంకకున్న గట్సేనని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. హీరోయిన్ అయినా హీరోలా సమాధానం ఇచ్చిందని అందరూ కితాబు ఇస్తున్నారు. ట్రంప్ గనక ఈ మాటలు వింటే ప్రియాంత చోప్రాతో ఏం చెబుతాడు? అని మరికొందరు చర్చలు చేస్తున్నారట. నిరంతరం వార్తల్లో ఉండటానికి ప్రియాంక చోప్రాలాంటి తెలివైన హీరోయిన్లు ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇస్తూనే ఉంటారు! ఆమె చెప్పిన ఒక్క మాట చర్చ జరిగేలా చేసి, లైమ్‌లైట్‌లో ఉండేలా చేసింది. అది ప్రియాంక అంటే!