Others

దర్శకులకు పెద్ద సవాల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేయడానికి ఏ ముహుర్తాన ‘బాబా’ సినిమా తీసి విడుదల చేసాడోగానీ, అది తుస్సుమంది. దాంతో సినిమా కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వాళ్లను ఆదుకోడానికి రజనీకాంత్ కొంత వదులుకున్నాడు. డబ్బును వాళ్లకు సర్దుబాటు చేశాడు. రాజకీయ అరంగేట్రం సైతం వాయిదా వేసుకుని హిమాలయాలకు వెళ్లిపోయాడు.
తిరిగొచ్చి ‘చంద్రముఖి’తో విజయం అందుకున్నాడు. కాకపోతే అది హీరోయిన్ జ్యోతిక ఖాతాలోకి వెళ్లిపోయింది. ‘లింగా’ చిత్రం మరో కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ సినిమా విషయంలోనూ నిర్మాతలు తిరిగి కొనుగోలుదార్లకు డబ్బులు చెల్లించి చేతులు ముడుచుకున్నారు. అలా తమిళ పరిశ్రమలో మొదలైన డబ్బు వాపస్ పరంపర తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కాలుమోపింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రం భారీ నష్టాలు మూటగట్టుకుంది. బయ్యర్లు పూరి ఇంటిముందు హంగామా చేశారు. డబ్బు చెల్లించమని గొడవకు దిగారు. ఆ దెబ్బతో పూరీ పోలీసు కేసు పెట్టాడు. ఇరువర్గాలు మీడియాకు ఎక్కి నానా గొడవ చేసుకున్నారు. పరిశ్రమ పెద్దలు ఇరువురినీ నివారించి సమస్యను పరిష్కరించారు.
లారెన్స్ దర్శకత్వం వహించిన రెబల్ సైతం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగిందే. ఈ పద్ధతి టాలీవుడ్‌లో క్రమంగా అనధికార అగ్రిమెంట్‌గా మారుతోంది. ఈ మధ్య చిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు కొందరు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. సినిమా ప్లాప్ అయితే, నష్టాన్ని నువ్వే పూడ్చాలంటూ డైరెక్టర్ పీకపై కత్తిపెడుతున్నారని తెలుస్తోంది. దర్శకుడు తన పారితోషికాన్ని వదులుకోవడమో, అప్పో సప్పో చేసి కట్టేసి బతుకు జీవుడా అని బయటపడటమో జరుగుతుంది. ఈ సంఘటనలు మీడియా, ప్రరిశ్రమ పెద్దల దృష్టికి రాకపోవడం గమనార్హం.
ఎన్టీఆర్, ఎఎన్నార్ కాలంలో అవాంతరాల వల్ల సినిమా నష్టపోతే, మరో సినిమాకు కాల్షీష్లు ఇచ్చేవారు. అంతేగానీ, పారితోషికం తిరిగి ఇచ్చేసే పరిస్థితి లేదు.
హైదరాబాద్ పరిశ్రమ తరలివచ్చిన కొన్నాళ్లకే -దర్శకులు పాకేజీ విధానం అమల్లోకి వచ్చింది. అదీ తమిళ పరిశ్రమ నుంచి తీసుకొచ్చిన విధానమే. అలా పాకేజీ విధానంతో మోహన్‌బాబు మరికొందరు చిత్రాలు నిర్మించినా హిట్‌కాక వదులుకున్నారు.
ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ‘అ ఆ’ చిత్రానికి పారితోషికంగా లాభాల్లో వాటా తీసుకున్నాడని వినిపించింది. రాజవౌళి కూడా అదే దారిలో పయనిస్తున్నట్టుంది. ఎపుడైతే దర్శకుడే అన్నీ తానై నిర్మాతను పట్టుకుంటున్నాడో అప్పుడే నిర్మాత పూర్తి బాధ్యత దర్శకుడిదే. అతను చెబితేనే సినిమా తీశాను, నష్టం వస్తే అతడే భరించాలి అని దర్శకుడి పీకపై కత్తిపెడుతున్నాడు. ఇది ఎటు దారి తీస్తుందో ఎవ్వరూ ఆలోచించడంలేదు. ఇకనైనా పరిశ్రమ పెద్దలు ఆలోంచి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే అందరికీ మేలే లేనిచో పరిశ్రమ పోలీస్ స్టేషన్ల్ చుట్టు తిరుగుతునే వుంటుంది.
-ఆకుల రాఘవ
చిత్ర పరిశ్రమలో కొత్త పోకడ
చిత్ర పరిశ్రమలో కొత్త పోకడఒకప్పుడు-
ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల కాలంలో సినిమా దారుణ పరాజయం చవిచూసో, ఏదైనా కారణాల వల్లో నిర్మాతకు నష్టాలు సంభవిస్తే తరువాతి సినిమాకు కాల్‌షీట్లు ఇచ్చి ఆదుకునేవారు. కృష్ణ మాత్రం సొంత పూచీకత్తు మీద సినిమా విడుదలచేయించి నిర్మాతను ఆదుకునేవారు. అంతేగాని -అప్పటి గొప్ప నటులెవరూ ఏ రోజూ పారితోషికం చెల్లించిన దాఖలాలు కనిపించవు. అది అప్పటి మర్యాద.
***
ఇప్పుడు-
సినిమా అంటే డైరెక్టర్. ఆర్థికంగానైనా, హార్థికంగానైనా అన్నింటికీ అతనిదే బాధ్యత. దర్శకుడే అన్నీ తానై నిర్మాతను పట్టుకుంటున్నాడు కనుక -నష్టాలకూ అతను బాధ్యత వహించాలన్న ట్రెండ్ వచ్చింది. ఈ మార్పు ఎటు దారితీస్తుందోనన్న భయాందోళన దర్శకుల్లో లేకపోలేదు. సినిమా నిలబడితే సరే.. లేదంటే దర్శకుడు తన రెమ్యునరేషన్ సహా వదిలేసుకుని, ఇంకా కాదంటే అప్పులు చేసైనా నిర్మాతకు సరిపెట్టాలి. పైకి చెప్పుకోలేకపోతున్నా -పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఒకటొకటిగా పెరుగుతున్నాయని అంటున్నారు.