Others

రైలు సీన్లు.. సూపర్ హిట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైలుతో తెలుగు సినిమాకు అవినాభవ సంబంధమే ఉంది. ఇంగ్లీష్ సినిమాల్లో ప్రయాణానికి సంబంధించి కీలక సన్నివేశాలను -విమానాల్లో చిత్రీకరిస్తుంటారు. అలాగే -తెలుగు సినిమాల్లో రైలు ముఖ్య భూమికే పోషించింది. పైన చెప్పుకున్న సినిమాలు కేవలం ప్రస్తావన మాత్రమే. వెతుక్కుంటూనో, గుర్తు చేసుకుంటూనో పోతే -తెలుగు సినిమాల్లో లెక్కలేనన్ని రైళ్లు. వాటి నేపథ్యంలో ఎన్నో సన్నివేశాలు. దాదాపు అన్నీ ‘ఆహా’ అనిపించాయి. సినిమాకు ప్రాణంగా నిలిచాయి. అలా వచ్చిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అలా కొన్నింటిని ప్రస్తావించుకుంటే.. ‘వర్షం’ చిత్రంలో రైలు ఆగిన సన్నివేశం, ‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా’ అంటూ త్రిష పాట.. సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ‘నీటిముల్లై సాగిపోనా’ అనే ఇంకో పాటలోనూ రైలు సన్నివేశం ఆకట్టుకుంటుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో త్రిష పరీక్షలు రాయడానికి పట్నానికి వెళ్తున్నపుడు రఘుబాబు మనుషులు అల్లరి పెట్టడం, శ్రీహరి ఫైట్ సన్నివేశం గొప్పగా చిత్రీకరించారు. ‘దుబాయ్ శీను’, ‘వెంకీ’, ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’ చిత్రాల్లో రైలు సన్నివేశాలు ఒకింత కీలకంగానే కనిపిస్తాయి. ‘లెజెండ్’ చిత్రంలోనూ రైలు దృశ్యాలు కనిపిస్తాయి.
ఉదయకిరణ్ నటించిన ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇందులో ‘నువ్వు నేను’లో ఉదయకిరణ్, అనితలు కలుసుకునే సన్నివేశం ఉత్కంఠగా సాగుతుంది. ‘మనసంతా నువ్వే’లో టైటిల్స్ ట్రెయిన్ వెళ్తున్నపుడు చూపించారు. ‘చెప్పనా ప్రేమ’ అనే పాట రైల్లోనూ ఉంటుంది. ‘జయం’లో ఏకంగా రైలుపైనే ‘బండి బండి రైలు బండి’ పాట తీశారు. పవన్‌కళ్యాణ్‌కు ‘ఖుషి’ సూపర్ విజయాన్ని అందించింది. ఇందులో మొదటి పాట, అలాగే ‘చెలియా చెలియా చిరుకోపమా’ అనే పాట, క్లైమాక్స్‌లో భూమిక, పవన్‌లు రైల్వేస్టేషన్‌లో కలుసుకోవాలన్నా కుదరకపోయే సన్నివేశం ఉంటుంది.
మహేష్‌బాబుకు ‘దూకుడు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘ఒక్కడు’ సినిమాలు హిట్టిచ్చాయి. ‘దూకుడు’ మహేష్ సినీ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం. దీంట్లో ఇంటర్వెల్‌కు ముందు రైలు సన్నివేశం కీలకమైంది. ఆ సన్నివేశంలోనే ప్రకాష్‌రాజు నమ్మినబంటు ఆదిత్యమీనన్ ప్రత్యక్షమవడం, ప్రకాష్‌రాజ్‌కు జరిగింది ప్రమాదం కాదని, అది కావాలనే చేసిన కుట్ర అనే విషయం తెలుస్తుంది. ‘పోకిరి’లో లోకల్ ట్రైన్స్‌లో మహేష్, ఇలియానాల పరిచయం, ఇలియానాను అల్లరి పెట్టిన వారితో మహేష్ ఫైట్ చేసే సన్నివేశాలున్నాయి. ‘అతడు’లో రైల్లోనే రాజీవ్ కనకాల పరిచయం, పోలీసులు జరిపిన కాల్పుల్లో రాజీవ్ చనిపోవడం, అతని స్థానంలో మహేష్ నాజర్ మనవడిగా వెళ్ళడం జరుగుతుంది. ‘ఒక్కడు’లో మహేష్ అండ్ టీం కబడ్డీ పోటీలకు కర్నూలుకు వెళ్ళడం, అక్కడ రైల్వేస్టేషన్‌లో ప్రకాష్‌రాజ్ భూమిక అన్న అచ్యుత్‌ను చంపడంతో విలన్ ఎంత కఠినుడో తెలుస్తుంది. ‘బిజినెస్‌మెన్’ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ రైల్లోనుంచి దిగడం. ఇక మల్టీస్టారర్ చిత్రం అని చెప్పుకునే ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రైలు సన్నివేశాలు ఉన్నాయి.
‘మర్యాద రామన్న’లో సునీల్, సలోనిల పరిచయ సన్నివేశాలు, అప్పుడు జరిగే కొన్ని హాస్య సంఘటనలు ఉన్నాయి. ‘ఆర్య’లో అల్లుఅర్జున్, శివబాలాజీ, అనుమెహతా సుబ్బరాజు నుంచి తప్పించుకోవాలని రైల్లో వెళ్ళడం, రైల్లో టి.సి.గా సునీల్ కామెడీ, ‘అ అంటే అమలాపురం’అనే సూపర్ హిట్ పాట ఉండే సన్నివేశాలు ఉన్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో వెంకటేష్ పరిచయ సన్నివేశం, సుహాసినీని వెంకటేష్, ఆర్తి అగర్వాల్‌లు రైలు ఎక్కించాలని రైల్వేస్టేషన్‌కు వెళ్ళడం, క్లైమాక్స్ రైల్వేస్టేషన్‌లో జరిగే సన్నివేశాలు ఉన్నాయి. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ఇంటర్వెల్ సన్నివేశం రైల్లో త్రిషను వెంకటేష్ చూసినప్పుడు వస్తుంది. ముమైత్‌ఖాన్ పాట రైల్లోనే ఉంటుంది.
‘కొత్త బంగారు లోకం’లో క్లైమాక్స్‌లో ప్రకాష్‌రాజ్‌ను వరుణ్ సందేశ్ రైలెక్కించి వెనుతిరగడం, ఆ రైల్లో వెళుతున్నప్పుడే ప్రకాష్‌రాజ్‌కు ప్రమాదం జరిగిన సన్నివేశం ఉంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో హైద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌నుంచి తిరుపతికి వెళ్లే నేపథ్యంలో సందీప్ కిషన్, తాగుబోతు రమేష్, సప్తగిరిల మధ్య జరిగే సన్నివేశాలు హాస్యంగా ఉంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా రోబో, శివాజీ, అపరిచితుడు, అరుంధతి, ఠాగూర్, విక్రమార్కుడు తదితర అనేక సినిమాల్లో రైలు సన్నివేశాలు కీలకంగా, ఉత్కంఠగా ఉంటూ సినిమాల విజయంలో ప్రత్యేక పాత్ర వహించాయి.
చెప్పొచ్చే విషయమేంటంటే -అనాదిగా రైలును చూపించిన ప్రతి సినిమా లేదూ సన్నివేశము సెంటిమెంట్‌గా హిట్టవుతూనే వస్తున్నాయి.

-కె సతీష్‌బాబు