జాతీయ వార్తలు

ఓటేసిన పలువురు ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలలో పోలింగ్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం నుంచే పలువురు ఓటర్లతో పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, ఒలింపిక్ పతాక విజేత యోగీశ్వర్ దత్, ప్రముఖ క్రీడాకారిణి బబితా పోగెట్, ఆర్సెస్ చీఫ్ మోహన్ భగవతీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ ఓటు మన ప్రజాస్వామ్య హక్కు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలిన సూచించారు.
హర్యానాలో జన నాయక్ జనతా పార్టీ నేత, మాజీ ఎంపీ దుశ్వంత్ చౌతాలా ఓటేసేందుకు తన భార్య, తల్లితో ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వచ్చి ఓటేశారు. అలాగే సీఎం ఖట్టర్ సైకిల్‌పై వచ్చి ఓటేశారు. తొలుత చండీగఢ్ నుంచి తన నియోజకవర్గమైన కర్నాల్‌కు శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారు. అక్కడి నుంచి సైకిల్‌పై వచ్చి ఓటేశారు. బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్‌ఖాన్ బాంద్రా వెస్ట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, ఆయన భార్య లారా దత్తా, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, తన భార్య జెనీలియాతో కలిసి లాతూర్‌లో ఓటు వేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత, తల్లి సరితతో కలిసి వచ్చి ఓటు వేశారు.