తెలంగాణ

ఓయులో బీఫ్ ఫెస్టివల్ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై రగడ కొనసాగుతోంది. మంగళవారం ఓయులో వామపక్ష, దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. బీఫ్ ఫెస్టివల్‌పై గోషామహల్ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను ఓయు విద్యార్థి సంఘాలు ఖండించాయి. బిజెపి దాని అనుబంధ సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి బీఫ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్నాయని పెద్దకూర పండుగ నిర్వాహకుడు డేవిడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఓయులో బీఫ్ ఫెస్టివల్‌పై ఈ నెల 5వ,తేదీన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా పెద్దకూర పండుగపై ఈ నెల 7న నగరంలోని నెక్లెస్ రోడ్డులో 5కె రన్‌ను నిర్వహించనున్నట్టు డేవిడ్ తెలిపారు. బీఫ్ ఫెస్టివల్‌పై రోజురోజుకూ విద్యార్థి సంఘాల మధ్య పరస్పర విరుద్ధ అభిప్రాయాలు చోటుచేసుకుంటుండంతో ఓయులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎబివిపి విద్యార్థి సంఘానికి మద్దతు ఇవ్వాడాన్ని నిరసిస్తూ వామపక్ష, దళిత, మైనార్టీ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యేపై తార్నాక పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆహారాన్ని నియంత్రించడం భావ్యం కాదని, బీఫ్ తక్కువ ధరకు వస్తుందనే తింటున్నారన్నారు. ఏదిఏమైనా ఈ నెల 10న యూనివర్సిటీలో వామపక్ష, దళిత, మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీఫ్ ఫెస్టివల్ జరిగితీరుతుందని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బీఫ్ ఫెస్టివల్‌పై విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.