మెదక్

పోలింగ్ కేంద్రాల్లో వౌలిక వసతులపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 21: నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వౌళిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న నారాయణఖేడ్‌లో జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల్లో వౌళిక వసతులు ఉండాలన్నారు. ర్యాంపులు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని, నీటి సౌకర్యంపై పరిశీలించి ఈ నెల 22లోగా నివేదికలు అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ కోసం జిల్లా అధికారులను నియమించడం జరిగిందన్నారు. నిర్ధేశించిన ఫార్మట్‌లో సమాచారం పొందుపర్చి అందజేయాలన్నారు. వౌళిక వసతులు లేని కేంద్రాల్లో ఏర్పాట్ల కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డిఆర్వో దయానంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.