రాష్ట్రీయం

పుర్రె గుర్తు ఉపసంహరణకు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ హామీ
సిరిసిల్ల, ఫిబ్రవరి 15: బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తులను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కార్మికుల ఉపాధి రక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం సాయంత్రం సిరిసిల్లలో ఎ ఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం మంత్రికి వినతి పత్రం ఇస్తూ కేంద్రం జారీ చేసిన జీవో వల్ల బీడీ కంపెనీలను సోమవారం నుండి మూసి వేయడంతో లక్షలాది మంది బీడీ కార్మికులు, వీటిలో పని చేస్తున్న ఇతర కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ఈ జీవో ఉపసంహరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, అలాగే కార్మిక మంత్రిని ఢిల్లీకి తీసుకెళ్ళి ఇక్కడి బీడీ కార్మికుల సమస్యను వినిపిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.