బిజినెస్

ప్రభుత్వ బాండ్ల వేలానికి అధిక స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: సోమవారం సాధారణ ట్రేడింగ్ అనంతరం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు నిర్వహించిన ప్రభుత్వ బాండ్ల వేలానికి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి అధిక స్పందన లభించింది. 3,011 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలానికి వేయగా, 3,448 కోట్ల రూపాయల విలువైన దరఖాస్తులు ఎఫ్‌పిఐల నుంచి వచ్చాయి. బిఎస్‌ఇలోని ప్రభుత్వ బాండ్లలో విదేశీ మదుపరులకున్న పెట్టుబడుల పరిమితిని పెంచడంతో దానికి తగ్గట్లుగా ఈ వేలం జరిగింది. గతంలో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోనూ ప్రభుత్వ బాండ్ల వేలం జరిగినది తెలిసిందే.