అక్షర

పద్య సాధకులకు మార్గదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి-2
ఖండకావ్య సంపుటి
- దోరవేటి,
పుటలు: 105;
వెల: 60 రూపాయలు,
ప్రతులకు- నవోదయ
బుక్‌హౌస్,
ఆర్యసమాజ్ ఎదురుగా,
కాచిగూడ క్రాస్‌రోడ్స్,
హైదరాబాద్

‘‘పదముల పోహళింపు రసబంధుర భావ పరీమశమ్ము నిం/ పొదవెడు తాళసంగతి ప్రబోధము మోదమనిచ్చు వస్తు సం/ పద హృదయమ్ము నిండి గుణవర్ధక కారణమై చెలం గునే/ విధముగనైన గొప్పది కవిత్వమునందున పద్యమొక్కటే’’ (పద్యప్రశస్తి ఖండిక)
పద్య ప్రక్రియపై దోరవేటి అభిమానానికి ఈ పద్యం సాక్ష్యం. పద్య ప్రక్రియ పట్ల ఆయన నిబద్ధత ఎంతో గొప్పది. బహుముఖ ప్రజ్ఞాశాలి దోరవేటి. పద్యంతోపాటు వచనం, గేయం, కథ, నవల, సాహిత్య చరిత్ర- ఇట్లా అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. పద్యమంటే ఆయనకు ప్రాణం. పలు సందర్భాలలో తన ఎదలోని ప్రతిస్పందనలకు పద్యరూపాన్ని కల్పించారు. ఈ ఖండికల్లో కొన్నింటిని ఎంపికచేసి ‘‘అంజలి’’ పేరుతో ప్రకటించారు.
కాళోజీ నారాయణరావు, యాది సదాశివ, ఆచార్య రవ్వాశ్రీహరి, సినారె, దాశరథి వంటి ప్రసిద్ధులతోపాటు తన సమకాలీనులైన ప్రతిభావంతుల్ని గురించిన ఖండికలూ ఇందులో ఉన్నాయి. తనకంటే పిన్నవయస్కుల ప్రతిభా పాటవాల్ని గుర్తించడంలో దోరవేటి సహృదయత దాగి ఉంది. కవిలో ఈ సహృదయత ఉండాలి. అప్పుడే పద్యాలు వినూత్న ద్యుతితో వెలిగిపోతాయి.
ఒక పద్యాన్ని చదివించేట్టుగా చేసేది, కవి ప్రతిభను ప్రాథమిక స్థాయిలో నిర్ధారించేది అందులోని ధారాశుద్ధి. దోరవేటి తన నిరంతర సాధన ద్వారా పద్య రచనలో ధారాశుద్ధిని సాధించారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. ‘‘కార్యసాధకుడు’’ శీర్షికతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును గురించి రాసిన పద్యాల్ని ఇందుకు నిరూపణలుగా చూపించవచ్చు. వాడుకలో ఉన్న తీయని పదాలనే వాడుతూ చక్కని పద్య రచన చేశారు దోరవేటి. పద్య రచన పట్ల ఆసక్తికలిగి ఆ ప్రక్రియలో సాధన చేయాలనుకునే వర్ధమానులకు మంచి మార్గదర్శిని ‘‘అంజలి’’.

-గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి