పోస్ట్ ప్రొడక్షన్‌లో ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, నాగార్జున పూర్తి వైవిధ్యంగా కనిపించే ఈ చిత్రంలో కార్తీ, తమన్నాల జంట మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందని, టీజర్‌ను ఈనెల 20న, ఆడియోను 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయిన ఒక వ్యిక్తి, ఎమోషనల్ ఛాలెంజ్డ్ అయిన మరో వ్యక్తి మధ్యన ఏర్పడిన బంధం ప్రధాన కథాంశంగా సాగే ఈ చిత్రంకోసం అనేక మంది భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారని, ప్రతి ఒక్కరికి నచ్చేలా రూపొందిందని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, పాటలు: సిరివెనె్నల, రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనె్న, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.