పార్టీలంటే ఇష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-రాశీఖన్నా

‘నిరంతరం షూటింగ్‌ల్లో పాల్గొంటూ బోర్‌కొట్టినప్పుడు పార్టీలకు వెళ్లకపోతే ఎలా?’ అని ప్రశ్నిస్తోంది నటి రాశీఖన్నా. అప్పుడప్పుడు ఏం ఖర్మ? రోజూ ఆమె పార్టీలకు వెళుతోందని టాలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త. షూటింగ్ లేకపోతే వెంటనే పార్టీల్లో ప్రత్యక్షమైపోతోందని, పబ్బులు, డిస్క్థోక్‌ల్లో సందడి చేస్తోందని సమాచారం. ఇందుకు వివరణ కూడా చక్కగానే ఇచ్చింది. తనకు నైట్‌లైఫ్ పార్టీలు అంటే చాలా ఇష్టమని, మనస్సుకు కాసింత సేద తీరడానికి అలా వెళతానని చెబుతోంది. రాత్రంతా అలా పార్టీల్లో గడిపినా ఉదయానే్న ఠంచన్‌గా షూటింగ్‌లకు వెళ్లగలిగే సత్తా తనకుందని అంటోంది. ఎంత లేట్‌గా పడుకున్నా, అసలు పడుకోకపోయినా ఉదయానే్న ఫ్రెష్‌గా షూటింగ్ చేయగలనని, ఆ గట్స్ తనకున్నాయని చెబుతోంది.