రాష్ట్రీయం

పేదలకు ఇసుక ఫ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: బ్రిటీష్ కాలంలో సముద్రంలో ఉచితంగా లభించే ఉప్పుకు పనే్నమిటంటూ ప్రజల నుంచి తీవ్ర నిరసనలు పెల్లుబికి ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం చేపట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా నదుల్లో కొట్టుకొచ్చే ఇసుక సామాన్యులకి లభించడం దుర్లభంగా మారుతోంది. ఇసుక క్వారీలను కోట్లాది రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్న నేపథ్యంలో ఒకవైపు అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ ఇసుక బంగారంగా మారింది. ఇసుక క్వారీల టెండర్ల విధానాన్ని తొలగించిన ప్రభుత్వం కొంతకాలం డ్వాక్రా మహిళలకు అప్పగించినప్పటికీ ఇసుక దొరకడం దుర్లభంగా మారింది. దీనిపై అనేక అవినీతి ఆరోపణలు, మరోవైపు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచించి పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకూ ఉచితంగానే సరఫరా చేయాలని శుక్రవారం మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో సిఎం ఆదేశించారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా చెడ్డపేరు ఎక్కువ వస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో నిర్మాణాలు పెరిగి అందరికీ ఉపాథి లభించగలదని, రాష్ట్భ్రావృద్ధికి ఇది ఎంతో చేయూతనిస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇసుక ఉచితంగా సరఫరా చేసే అంశంపై మార్చి 16న విధి విధానాల రూపకల్పన చేస్తామని చెప్పారు.