అంతర్జాతీయం

పట్టం కడితే అక్రమ వలసదారుల్ని పంపేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, ఫిబ్రవరి 26: అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకుంటే మూడు లక్షలమంది భారతీయులు సహా 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపేస్తానని అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఈ పదకొండు మిలియన్ల మంది కూడా వెనక్కి వెళ్లిపోయి మళ్లీ న్యాయ మార్గాల్లో అమెరికాలో ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు 11 మిలియన్ల మంది అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని, వారు ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసిన ఆయన, వీరిలో కొంతమంది తిరిగివచ్చే న్యాయమార్గాల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రక్రియ అంత వేగవంతంగా పూర్తయ్యేది కాదని, అందుకు సుదీర్ఘ వ్యవధి పడుతుందని అధ్యక్ష పదవికి సంబంధించి అక్రమ వలసదారులపై జరిగిన పోటాపోటీ చర్చలో ఆయన పాల్గొన్నారు. అక్రమంగా అమెరికాలో ప్రవేశించే కంటే కూడా సక్రమంగా రావడమే అందరికీ మేలని తెలిపారు. మొత్తం 11 రాష్ట్రాలు డెమోక్రాట్ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థులపై తమ తీర్పును ఇవ్వనున్న దృష్ట్యా అక్రమ వలసదారులకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది.