జాతీయ వార్తలు

పెను వ్యాధులు ముంచుకొస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత జనాభాలో దాదాపు 70మిలియన్ల మంది ప్రాణాంతకమైన అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని భారత క్లినికల్ పరిశోధన సొసైటీ (ఐఎస్‌సిఆర్) తెలిపింది.
ప్రస్తుతం 7వేలకు పైగా ఈ ప్రమాదకరమైన వ్యాధులు వున్నాయని ఇవన్నీ కూడా వేగంగా వృద్ధి చెందుతూ ఆయా వ్యక్తుల ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం వుంటుందని వెల్లడించింది. ఈ వ్యాధుల తీవ్రత వల్ల అవి సోకిన వ్యక్తులు క్రమంగా శక్తిహీనులవుతారని తెలిపిన ఐఎస్‌సిఆర్ ప్రస్తుతం 90శాతానికి పైగా ఈ వ్యాధులకు చికిత్సేలేదని స్పష్టం చేసింది. ప్రతి ఏటా కూడా ఈ ప్రమాదకర వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య పెరుగుతూనే వుందని వెల్లడించింది. చాలా వరకు ఈ వ్యాధులన్నీ జన్యుపరంగా సంక్రమించేవేనని ఆయా వ్యక్తుల జీవితకాలం పా టు వాటిని చికిత్స చేయడం సాధ్యం కాదని వెల్లడించింది.
ఈ రకమైన అరుదైన ప్రమాదకర వ్యాధులకు లోనవుతున్న వారిలో పిల్లలేనని, దీనిలో 30 శాతం మంది ఐదేళ్ల వరకు కూడా బతికే అవకాశం వుండదని స్పష్టం చేసింది. ఈ వ్యాధులు ఎవరికి సోకినా వాటి ఉనికిని గుర్తించడానికే ఏడేళ్ల వ్యవధి పడుతుందని ఐసిఎస్‌ఆర్ తెలిపింది. భారత్‌లోని 70మిలియన్ మంది రోగులకు ఈ వ్యాధి వచ్చిన విషయమే తెలిసే అవకాశం వుండదని, ఒక వేళ తెలిసినా దానికి చికిత్స చేయించుకునేందుకు ఎలాం టి అవకాశమూ లేదని, ఒకవేళ వున్నా అది చాలా భారీ ఖర్చుతో కూడుకున్నదే అవుతుందని తెలిపింది. ప్రతి ఏటా ఫిబ్రవరి నెల్లో చివరి శుక్రవారాన్ని ‘అరుదైన ప్రాణాంతక వ్యాధుల దినోత్సవం’గా పాటిస్తారు.