AADIVAVRAM - Others

పండుగ (సిసింద్రి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం కావటంవల్ల ఉదయం ఏడైనా ఇంకా మంచం దిగలేదు శివ.
శివ ఏడవ తరగతి విద్యార్థి. వారమంతా త్వరగా లేవటం, స్కూలు, ట్యూషన్, డాన్స్ క్లాసెస్ అంటూ ఎప్పుడూ బిజీగా ఉండటంవల్ల ‘లే స్కూల్ బస్ వచ్చేస్తుంది’ అన్న కేకలు వినిపించలేదన్న ఆనందంతో రంగురంగుల కలలు కంటూ నిద్రపోతున్నాడు.
‘శివా.. ఊర్నుంచీ మనింటికి ఎవరొచ్చారో చూడు’ అన్న పిలుపు హాల్లో నుంచి వినిపించి దిగ్గున మేలుకున్నాడు.
ఊర్నుండీ పొద్దునే్న రైలు దిగి వచ్చిన వాళ్ల తాతయ్యను చూడగానే సంతోషంగా వెళ్లి ఒళ్లో కెక్కాడు. పండుగకు తీసుకెళ్లడానికి వచ్చానని ఆయన చెప్పటంతో మరింత హుషారుగా ఎగిరి గంతులేశాడు.
ఎందుకంటే ఎప్పుడూ వాళ్ల నాన్నగారి ఉద్యోగరీత్యా సిటీలలోనే ఉండటంవల్ల లీవులు లేక తీసుకెళ్లకపోవటంతో తనకు బుద్ధి తెలిశాక ఎప్పుడూ సొంత ఊరు వెళ్లలేదు.
‘ఈసారి ఎలాగైనా శివను తీసుకురావాలని వాళ్ల నాన్నమ్మ పట్టుబట్టడంతో శివను మాత్రం పంపటానికి ఒప్పుకున్నాడు.
‘సరేసరే... తాతగారిని కాస్త స్నానం చేసి, ఫలహారం తీసుకొని రెస్ట్ తీసుకోనివ్వు. మనం లగేజ్ సర్దుదాం నీ కోసం. ఎల్లుండి బయలుదేరుదురు గానీ... నాన్నగారు టికెట్ బుక్ చేస్తారు’ అంది శివ తల్లి.
* * *
బస్సు దిగి చెరువు కట్ట మీద నడుస్తుంటే చెరువంతా తామరలు కొంగలతో అందంగా కనిపించింది. పొగమంచుతో పొలాలన్నీ పచ్చగా ఆహ్వానించింది. శివ వాళ్ల నాన్నమ్మ ఇల్లు చేరగానే చుట్టుపక్కల తెలిసిన వాళ్లు, బంధువులు వాళ్ల పిల్లలతో సహా వచ్చేసి పట్నం కబుర్లు అడగటం మొదలుపెట్టారు. ఈలోపు నాన్నమ్మ తనకెంతో ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది. తాతయ్య చెట్టు మీద మాగిన సీతాఫలాలు తెచ్చి పెట్టారు. పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఆడుకొన్నారు. పక్క ఊర్నుండొచ్చిన అత్తమ్మ మామయ్య వాళ్ల పిల్లలు కొత్త ఆటలు నేర్పారు.
మామయ్య, బాబాయ్ వరసయ్యే బంధువులతో కలిసి తాతయ్యతో పొలాల వైపు వెళ్తుంటే, దారి పొడవునా గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్లు, హరిదాసులు, గొబ్బి పాటలు పాడేవాళ్లు ఎదురయ్యారు.
పొలాల దగ్గర చెరకు చీల్చి ఇచ్చాడు తాతయ్య. వేరుశెనగ చెట్లు తవ్వి కడిగి కాయలు వలిచిపెట్టాడు. ఓ గంటసేపు హాయిగా తిరుగుతూ అందరూ గడిపేలోగా నాన్నమ్మ బుట్టలో భోజనం పట్టుకొచ్చింది. కమ్మటి వెన్న, తీయని పెరుగు రుచి వాళ్ల ప్రేమలాగే కమ్మగా ఉంది.
ఎన్నో మధుర జ్ఞాపకాలతో తిరిగి ఊరెళ్లాక తోటి విద్యార్థులతో కబుర్లు పంచుకుని ఆనందించాడు తను. ఒకసారి లాప్‌టాప్‌లోంచి తలపైకెత్తి కళ్లజోడు తీసి పక్కన నిద్రపోతున్న పదేళ్ల కొడుకుని చూశాడు. తోటి స్నేహితులంతా సొంత ఊళ్లకెళ్తున్నారు పండక్కి. మనం వెళ్దాం డాడీ అని అడిగి అడిగి అలసిపోయి పడుకున్నాడు. పాపం. కొడుకు తల నిమిరాడు ప్రేమగా.
ఆన్‌లైన్‌లో ట్రైన్ టిక్కెట్స్ బుక్ చేశాడు. తాను అనుభవించిన తీపి జ్ఞాపకాలు తన తరువాత తరానికి పంచకపోవడం ఎంత స్వార్థమో తెలిసొచ్చి, పిల్లల భవిష్యత్తు పేరుతో ధనం మాత్రమే కాదు వాళ్లకు మన సంప్రదాయాలు తన వాళ్లు తన ఊరు తన వాళ్ల ఆప్యాయతలు అనే కనీస మానవ సంబంధ విలువని కూడా ఇవ్వాలని నిర్ణయించుకుని.

-డేగల అనితాసూరి