ఆంధ్రప్రదేశ్‌

జాడలేని ‘అమరావతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 27: విశాఖలో అట్టహాసంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు స్వప్నసౌధం, రాష్ట్ర నూతన రాజధాని ‘అమరావతి’ జాడ మచ్చుకైనా కనిపించలేదు. కనీసం అమరావతి ప్రస్తావన లేకుండానే తొలిరోజు మహానాడు ముగియడం గమనార్హం. రాష్ట్ర రాజధాని అమరావతిని భారీ స్థాయిలో నిర్మించాలని చంద్రబాబు మూడు సంవత్సరాలుగా తపన పడుతున్నారు. రాజధాని డిజైన్ల కోసం ఆయన సుమారు అర డజను దేశాల ఆర్కిటెక్ట్‌లు గీసిన డిజైన్లను పరిశీలిస్తూ వస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడో సంవత్సరం పూర్తవుతున్నా, అమరావతి మాత్రం కొలిక్కి రాలేదు. ఈ మూడేళ్లలో చంద్రబాబు పాల్గొన్న ఏ సమావేశం అయినా అమరావతి ప్రస్తావన రాకుండా జరిగిన సందర్భం లేనే లేదు. అమరావతిపై డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్తూ వచ్చిన చంద్రబాబు దాని గురించి స్మరణ చేయకుండా ఉండని రోజు లేదు. అలాంటిది, పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన మహానాడు సంబరంలో కనీసం అమరావతికి సంబంధించి ఒక్క ఛాయాచిత్రాన్ని కానీ, నమూనాని కానీ మహానాడు వేదిక వద్ద ఎక్కడా ఏర్పాటు చేయలేదు. కనీసం అమరావతిలోని బౌద్ధస్థూపానైనా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ప్రధాన వేదికకు ఒకవైపు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్‌ల నమూనాలను ఉంచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహానాడు కాబట్టి ఈ రెండు నమూనాలను ఇక్కడ ఉంచారని అంతా సరిపెట్టుకున్నారు. హైటెక్ సిటీ చంద్రబాబు కృషికి దర్పణం. పోలవరం ప్రాజెక్ట్ ఆయన లక్ష్యం. వీటన్నింటికీ మించి ఆయన మానసపుత్రికగా భావిస్తున్న రాజధాని అమరావతిని వేదిక వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయారన్నది చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వద్ద ప్రస్తావించగా అవును..నిజమేనంటూ నాలుక కరుచుకున్నారు.
బాలకృష్ణ గైర్హాజరు
ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామగారైన నందమూరి బాలకృష్ణ మహానాడుకు హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జయంతి రోజైన ఆదివారమైనా ఆయన ఈ మహానాడుకు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
లోకేష్ బిజీ బిజీ
జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొద్ది సేపు మాత్రమే వేదికపై ఉన్నారు. ఆ తరువాత వేదిక దిగి, సభా ప్రాంగణంలోనే కూర్చుని పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ బిజీ బిజీగా కనిపించారు. తెలంగాణ, ఏపి నాయకులతో ఆయన సన్నిహితంగా మాట్లాడ్డం కనిపించింది.